South actresses: సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన చాలా మంది భామలు.. బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో దక్షిణాదిలో హిట్టైన ఈ భామలు మాత్రం హిందీలో సత్తా చూపెట్టలేక బోల్తా పడ్డారు. ఎవరెరున్నారో చూద్దాం..
పూజా హెగ్డే.. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో చేసిన ‘మొహంజోదారో’తో పరిచయమైంది. ఆ తర్వాత సల్మాన్ తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’వరకు ఈమె నటించిన ఏ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయాయి.
త్రిష కృష్ణన్.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో చేసిన ఫస్ట్ మూవీ ‘ఖట్టా మీఠా’ ఫ్లాపు కావడంతో మళ్లీ ఆ వైపు తిరిగి చూస్తే ఒట్టు. మళ్లీ నార్త్ సినీ ఇండస్ట్రీకి తన ముఖం కూడా చూపట్టలేదు త్రిష.
శృతి హాసన్.. బాలీవుడ్ మూవీతో ‘లక్’తో పరిచయమైన శృతికి బాలీవుడ్ మాత్రం లక్కీగా కలిసి రాలేదు. అక్కడ నటించిన ఒక్క సినిమా అంటే ఒక్క సినిమాతో హిట్టు కొట్టలేకపోయింది.
షాలినీ పాండే... అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో పాపులర్ అయిన షాలినీ పాండే.. హిందీలో ‘జయేష్ బాయ్ జోర్దార్’ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
రంభ.. రంభ బాలీవుడ్ లో సక్సెస్ ల కంటే ఫ్లాపులే ఎక్కువున్నాయి. అక్కడక్కడ అడపాదడపా హిట్స్ అందుకుంది. బాలీవుడ్ పెద్దగా కలిసి రాలేదునే చెప్పాలి.
పార్వతి తిరువోతు.. హిందీలో చేసిన ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. మొత్తంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికలుగా రాణించిన చాలా మంది నార్త్ కు చెందిన వాళ్లే కావడం గమనార్హం. అందులో కాజల్,తమన్నా వంటి వారు ఉన్నారు.
తమన్నా భాటియా తమన్నా బాలీవుడ్ లో నటించిన సినిమాలేవి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ బాహుబలి సినిమా హిట్టైనా.. ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళి, ప్రభాస్ ఖాతాలోకే పోయింది. ఏదో అరకొర అనుష్కకు పేరొచ్చిందే తప్ప.. తమన్నాకు ఒరింగిందేమి లేదు.
కాజల్ అగర్వాల్.. కాజల్ అగర్వాల్ హిందీలో అజయ్ దేవగణ్ సరసన నటించిన ‘సింగం’ స్పెషల్ 26 తప్పించి పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది. ఉన్నంతలో కాస్త పర్వాలేదు అని చెప్పాలి.
హన్సిక మోత్వానీ హిందీలో చేసిన ఏ సినిమాలేవి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బాలనటిగా చేసిన ‘కోయి మిల్ గయా’ మాత్రమే హిట్ అనిపించుకుంది.