Elephants:పేర్లతో పిలుచుకుంటున్న అక్కడి ఏనుగులు.. సైంటిస్టుల పరిశోధనల్లో బైటపడ్డ విస్తుపోయే విషయాలు..

Savanna elephants: ఆఫ్రికాలోని ఏనుగులు భిన్నత్వంను కల్గి ఉంటాయని ఇటీవల సైంటిస్టులు తమ పరిశోధనల్లో తెలిపారు. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలతో ఇతర ఏనుగులను పిలుస్తాయంట.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 14, 2024, 02:04 PM IST
  • వెరైటీగా ప్రవర్తిస్తున్న సవాన్న ఏనుగులు...
  • మరింతలోతుగా పరిశోధలను అవసరమన్న సైంటిస్టులు.
Elephants:పేర్లతో పిలుచుకుంటున్న అక్కడి ఏనుగులు.. సైంటిస్టుల పరిశోధనల్లో బైటపడ్డ విస్తుపోయే విషయాలు..

African Savanna Elephants: సాధారణంగా మనుషులందరికి ఏదో ఒక పేర్లు ఉంటాయి. ఎవరికి ఇష్టమైన పేర్లను వారి పెట్టుకుని, పిలుచుకుంటారు. ఇక కొందరు తమ ఇళ్లలో పెంపుడు జంతువులను ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. వాటికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ.. పిలుచుకుంటారు. కొన్నిసార్లైతే ఏది జంతువు పేరో.. ఏది మనుషుల పేర్లో కూడా అర్ధం కాని విధంగా ఉంటాయి. జంతువులకు కూడా మనుషుల పేర్లు పెట్టేస్తుంటారు. ఇక కుక్కలు, పిల్లులకు ఉన్న పేర్లు.. ఎవరికైన ఉంటే.. వారిని ఆటాడేసుకుంటారు. ఆఫ్రికాలోని ఏనుగులు కూడా తమ తోటి ఏనుగును పేర్లతో  పిలుస్తాయంట. ఏనుగులు గుంపులు నుంచి విడిపోగానే.. వెంటనే అవి మరల వచ్చేందుకు వీలుగా ఒక రకమైన శబ్ధాలతో పిలుస్తాయంట. దీనిపై ఇటీవల సైంటిస్టులు పరిశోధనలను జరిపి మరీ క్లారిటీ ఇచ్చారు.

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

మెయిన్ గా ఆఫ్రికాలోని సవాన్న ఏనుగులు ఎంతో యాక్టివ్ గా ఉంటాయంట. ఇతర ప్రాంతాలో ఉండే ఏనుగుల కన్నా.. ఒక అడుగు ముందే ఉంటాయంట. ఇవి తమ గుంపులోని ఏనుగులను ప్రత్యేకంగా పేర్లతో పిలుస్తాయంట. జంతువులలో మనం.. డాల్ఫిన్ లు, చిలుకలు మనుషులకు ఎంతో ప్రతిస్పందిస్తాయని చెబుతుంటారు. ఇప్పుడు సవాన్న ఏనుగులు కూడా మనిషికి మల్లే ఇతర ఏనుగులకు పేర్లు పెట్టుకుంటాయంట. దీనికోసం సైంటిస్టులు  మిషిన్ లెర్నింగ్ అనే విధానంను ఉపయోగించారు. అయితే.. మైఖేల్ అనే సైంటిస్టుల  బృందం దీనిపై పరిశోధలను చేశారంట.

దీని కోసం ప్రత్యేక వాహనాలలో ఏనుగులను అనుసరించారంట. ఏనుగులు ఉత్పత్తి చేసే శబ్దాలు, వాటికి రెస్పాండ్ అయ్యే ఏనుగులు ఏవిధంగా ప్రవర్తించడం  వీటన్నింటిపై పరిశోధనలు చేసి అవి మాట్లాడుకుంటాయని సైంటిస్టులు ఒక అంచనాలకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా లోతుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  సాధారణంగా ఏనుగులు.. అడవుల్లో ఎక్కువగా కన్పిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఏనుగులు అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాలపైన దాడులు చేసిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. పంట పోలాలను ధ్వంసం చేసిన ఘటనలు కొకొల్లలు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

కొన్ని చోట్ల..  ఏనుగుల దాడుల్లో చనిపోయిన  సంఘటనలు కూడా జరిగాయి. ఏనుగులు తమ గుంపు నుంచి వేరుపడినప్పుడు ఎంతో కోపంగా ఉంటాయి. ఏనుగులు రోడ్డు దాటుతున్నప్పుడు, ట్రైన్ పట్టాలను క్రాస్ చేస్తున్నప్పుడు రైలు ప్రమాదాలు తరచుగా గురౌతుంటాయి. ఏనుగులను కాపాడటం కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా సేవ్ ది ఏలిఫెంట్ కార్యక్రమంను చేపట్టాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News