David Warner: తగ్గేదేలే అంటున్న డేవిడ్ వార్నర్​- ఇన్​స్టాలో వీడియో వైరల్​!

David Warner: డేవిడ్​ వార్నర్​.. క్రికెటర్​గానే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్​గా ఉంటూ వినోదం అందిస్తుంటాడు. తాజాగా వార్నర్ పుష్ప  సినిమాలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 12:07 PM IST
  • సోషల్ మీడియాలో మరోసారి ట్రేండవుతున్న డేవిడ్ వార్నర్​
  • పుష్ప సినిమా డైలాగ్​తో అదరగొట్టిన ఆస్ట్రేలియన్ క్రికెటర్​
  • ఇన్​స్టా గ్రామ్​లో వీడియో వైరల్​
David Warner: తగ్గేదేలే అంటున్న డేవిడ్ వార్నర్​- ఇన్​స్టాలో వీడియో వైరల్​!

David Warner: సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే క్రికెటర్ అంటే ముందుగా గుర్తొచ్చేది డేవిడ్​ వార్నర్​. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినప్పటికీ వార్నర్​ ఐపీఎల్​ ద్వారా ఇండియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన ఆటతోనే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా కుడా వార్నర్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

లాక్​డౌన్​లో తెలుగు పాటలకు స్టెప్పులు..

కరోనా లాక్​డౌన్ సమయంలో వార్నర్​ తెలుగు పాటలకు స్టెప్పులేసి మెప్పించాడు. మాస్​ డైలాగులు కూడా పెల్చాడు. ఇందులో బుట్ట బొమ్మ పాటకు వార్నర్ వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఇంటర్నెట్​లో హల్​చల్ చేస్తూనే ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాష పాటలు, ఫ్యాన్స్​ ఎడిట్​ చేసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటాడు. వార్నర్​ స్పూఫ్ వీడియోలకు ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉన్నారంటే.. అర్థం చేసుకోవచ్చు అతడికి సోషల్​ మీడియోలో ఎంత ఫాలోయింగ్​ ఉంటుందో.

తాజాగా కొత్త డైలాగ్​ పేల్చిన వార్నర్​..

అల్లు అర్జున్  హీరోగా సుకుమార్​ తెరకెక్కించిన 'పుష్ప' (Puspa Movie news) సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నెల 17న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఓ డైలాగ్​ చాలా రోజులుగా ట్రేడవుతోంది. అదే 'పుష్ప.. పుష్ప రాజ్​.. తగ్గేదే లే'. ఈ డైలాగ్​ చెప్పాడు వార్నర్. అయితే తన ఒరిజినల్​ వాయిస్​తో ఈ డైలాగ్​ చెప్పలేదు (David Warner Thaggedele Dialogue) వార్నర్​. సినిమాలో డైలాగ్​కు లింప్​ మూమెంట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడది వైరల్​గా మారింది. నిన్న ఈ వీడియోను పోస్ట్​ చేయగా.. 740,135 మంది లైక్​ కొట్టారు.

ఇంతకు ముందు కూడా పుష్ప సినిమాలో 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అనే సాంగ్​కు స్పూఫ్​ చేశాడు వార్నర్​ ఆ వీడియోకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.

Also read: Top searches of 2021: గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన టాప్-10 టాపిక్స్ ఇవే...

Also read: Anand Mahindra: ఆ టైగర్ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఫన్నీ కామెంట్స్.. వాటే సెన్సాఫ్ హ్యూమర్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News