Giant Anaconda Viral Video: బాప్‌రే ఇంతపెద్ద 'అనకొండ'నా.. వీడియో చూస్తే ఆమ్మో అనకుండా ఉండలేరు!

Viral Video, Giant Anaconda spotted in Tamil Nadu Forest. తమిళనాడులోని తిరునెల్వేలి కడయనల్లూర్ అడవిలో భారీ అనకొండ చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబందించిన వీడీయో నెట్టింట వైరల్ అయింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Oct 18, 2022, 06:34 PM IST
  • బాప్‌రే ఇంతపెద్ద 'అనకొండ'నా
  • వీడియో చూస్తే ఆమ్మో అనకుండా ఉండలేరు
  • దక్షిణ అమెరికాలో 40 అడుగుల అనకొండ
Giant Anaconda Viral Video: బాప్‌రే ఇంతపెద్ద 'అనకొండ'నా.. వీడియో చూస్తే ఆమ్మో అనకుండా ఉండలేరు!

Giant Anaconda spotted in Tamil Nadu Tirunelveli Kadayanallur Forest: అనకొండ.. ఇది ప్రపంచములో అతిపెద్దదైన సర్పజాతి. బాయిడే కుటుంబానికి చెందిన సరీసృపాలు. ప్రపంచంలో అతిపెద్ద విషరహిత సర్పం కూడా అనకొండనే. ఇవి మనుషులను లేదా ఇతర జంతువులను తమ చుట్లతో నలిపివేసి చంపి తింటాయి. ఇరవై జాతులలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవిగా ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లుగా ఇవి మానవులకు అంతగా హాని తలపెట్టవని శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో తేలింది.  

దక్షిణ అమెరికాలోనే అతి పెద్ద అనకొండ ఉంది. దాని పొడవు 40 అడుగులు ఉంటుంది. అది దాదాపు వెయ్యి పౌం‍డ్ల బరువు ఉంటుంది. మనుషులను, జంతువులను తినే ఆరు రకాల పాములలో ఇది ముఖ్యమైంది. ఇక భారత దేశంలో కనిపించే కొండచిలువ వీటిలో ఓ రకం. కొండచిలువలు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుండంతో.. వాటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తమిళనాడులో ఓ భారీ కొండచిలువకు సంబందించిన వీడీయో నెట్టింట వైరల్ అయింది.

తమిళనాడులోని తిరునెల్వేలి కడయనల్లూర్ ఫారెస్ట్‌లో భారీ అనకొండ చక్కర్లు కొట్టింది. పిల్ల దారిలో దాదాపు 20 అడుగులకు పైగా ఉన్న   అనకొండ వెళ్ళింది. దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ వీడియోని విలేజ్ ప్లానెట్ (Village Planet) అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. వీడియో చూసిన వారు ఆమ్మో ఇంతపెద్ద పామా అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read: టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం.. హిట్టర్లకు మారుపేరు వెస్టిండీస్‌ను ఓడించిన పసికూన స్కాట్లాండ్‌!

Also Read: Hansika Motwani Marriage : సైలెంట్‌గా హన్సిక పెళ్లి ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News