Snow Train Travel Video: మంచుకొండల్లో మ్యాజికల్ ట్రైన్ జర్నీ.. స్విట్జర్లాండ్ కాదు ఇండియానే.. మంత్రముగ్ధుల్ని చేస్తున్న వీడియో

Snow Train Travel Video: భూమిపై ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో మన దేశంలోని జమ్మూ కశ్మీర్ కూడా. ఇది పచ్చని లోయలు, సుందరమైన మంచుతో కప్పబడిన ప్రదేశాలకు పెట్టింది పేరు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 11, 2024, 05:56 PM IST
Snow Train Travel Video: మంచుకొండల్లో మ్యాజికల్ ట్రైన్ జర్నీ.. స్విట్జర్లాండ్ కాదు ఇండియానే.. మంత్రముగ్ధుల్ని చేస్తున్న వీడియో

Snow Train Travel Video: భూమిపై ఎన్నో అందమైన, అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో మన దేశంలోని జమ్మూ కశ్మీర్ కూడా. ఇది పచ్చని లోయలు, సుందరమైన మంచుతో కప్పబడిన ప్రదేశాలకు పెట్టింది పేరు. స్వర్గాన్ని తలపించే అద్బుతమైన దృశ్యాలకు నెలవు. ఈరోజు మనం చూడబోతున్న వీడియో కశ్మీర్ కు సంబంధించిందే. ఈ వీడియోను ఇండియన్ రైల్వ్సే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచులో మ్యాజికల్ ట్రైన్ జర్నీలా కనిపిస్తోంది. అంతా మంచుమయంలా కనిపిస్తోన ఈ ట్రైన్ జర్నీ వీడియోను మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వ్సే తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై షేర్ చేసింది.

ఇదీ చదవండి: రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ ధర 1986లో ఎంతో తెలుసా? ఇదిగో బిల్ చూడండి..!

 

ఇండియన్ రైల్వ్సే పోస్ట్ చేసిన ఈ వీడియో జమ్మూకశ్మీర్ మధ్యగుండా వెళ్తున్న అందమైన ట్రైన్ సుందరమైన దృశ్యాలు. ఈ మంచు ప్రదేశంలో రైలు ఇంజిన్ కూడా మంచులో తడిసి ముద్దాయింది. చివరకు రైలు పట్టాలు కూడా మంచులో దాక్కున్నాయి . మంచుకొండల్లో నడుస్తోన్న ఈ ట్రైన్ చుట్టూ పర్వతాలు కూడా మంచుతో వెండిలా మెరుస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేలల్లో లైక్స్ , వ్యూస్ వస్తున్నాయి. ఇది అద్భుతంగా ఉంది అని కొందరు, వచ్చే ఏడాది ఇక్కడికే మా ట్రిప్ కన్పామ్ అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.

 

ఇదీ చదవండి:  కోర్టు విచారణలో లేడీ జడ్జికి లవ్ ప్రపోజ్ చేసిన దొంగ..! మిలియన్ల మంది వీక్షించిన వీడియో..

ఈ ఉత్కంఠభరితమైన రైలు ప్రయాణాన్ని మీరూ అనుభవించండి అని భారతీయ రైల్వే ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూస్తే మనం కూడా కాసేపు కశ్మీర్ లోనే ఉన్నామా? అనే ఫీలింగ్ కలుగుతోంది. జీవితంలో ఒక్కసారైన ఈ ప్రదేశానికి వెళ్లాల్సిందే అని ప్రతిఒక్కరికీ కచ్ఛితంగా అనిపిస్తుంది. మరి మీరెమంటారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News