మూవీ రివ్యూ: లగ్గం (Laggam)
నటీనటులు: సాయి రోనక్, రాజేంద్ర ప్రసాద్, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, సప్తగిరి, కృష్ణుడు, రోహిణి తదితరులు
ఎడిటర్: బొంతల నాగేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఎం.ఎన్. బాల్ రెడ్డి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మణిశర్మ
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాత: వేణు గోపాల్ రెడ్డి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రమేశ్ చెప్పాల
విడుదల తేది: 25-10-2024
పెళ్లి చేసి చూడు.. ఇళ్ల కట్టి చూడు అన్నారు పెద్దలు. అంటే ఓ లగ్గం చేయనీకి ఓ కుటుంబం ఏ తీర్ల కష్టపడుతరన్న విషయాన్ని చెప్పే చిత్రం ‘లగ్గం’. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ..
సదానందం (రాజేంద్ర ప్రసాద్) తన బిడ్డ మాసన (ప్రగ్యా నగ్రా)కి లగ్గం చేయాలని తన సొంత చెల్లెలు సుగుణ (రోహిణి) కొడుకు (సాయి రోనక్)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటడు. అందుకోసం కాబోయే అల్లుడు ఎలా ఉన్నాడో చూడ్డానికి పట్నానికి వస్తడు. ఇక్కడ అల్లుడి సాఫ్ట్ వేర్ ఉద్యోగం, లగ్జరీ లైఫ్, జీతం, సోకులు గట్రా చూసి తన బిడ్డను అల్లుడికి ఇచ్చి లగ్గం చేయాలని ఫిక్స్ అయితుడు. ఈ నేపథ్యంలో అల్లుడితో తన కూతరు లగ్గం జరిపించాడా లేదా అనేది చూడాలి.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో తెలంగాణ నుంచి పలువురు దర్శకులు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెళ్లి తంతు లగ్నాన్నే.. లగ్గం అంటూ పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పెళ్లి ఆచార, వ్యవహారాలు, పద్దతులను చూపిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ముఖ్యంగా పెళ్లంటే పందిళ్లు..సందట్లు.. టప్పట్లు.. తాళాలు .. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరెళ్లు అని ఓ కవి చెప్పినట్టు.. ఓ పెళ్లి వెనక..రెండు కుటుంబాల ఆత్మీయ కలయిక.. దాని వెనక ఓ కుటుంబం పడే పాట్లు.. పెళ్లికి ముందు రెండు కుటుంబాలు ఏయే ఆలోచనలు చేస్తాయనే విషయాన్ని అంతే ఆసక్తికరంగా తెరపై మలిచాడు దర్శకుడు. ఒకపుడు ‘పెళ్లి సందడి’ , నువ్వు నాకు నచ్చావ్ వంటి మూవీలు ఎలా ట్రెండ్ సెట్ చేసిందో..ఇపుడు వచ్చిన ‘లగ్గం’ కూడా తెలుగులో మంచి కుటుంబ కథ చిత్రంగా నిలవనుంది.
మ్యారేజ్ సెట్ అయినంత మాత్రాన పెళ్లికూతురు అవుతుందా.. అసలు లగ్గం చేయాలంటే ఏం కావాలి.. వంటి అనేక విషయాన్ని డిస్కస్ చేసుకుంటూ మన సంస్కృతి, సాంప్రదాయలు ఏమిటనేవి ఈ సినిమాలో మిస్ చేయకుండా దర్శకుడు తన మార్క్ మేకింగ్ తో ఎంతో అర్థవంతంగా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ కు ముందు ఇచ్చే ట్విస్ట్ తో తర్వాత ఏం జరగబోతుందనే ట్విస్ట్ ఆలోచింప జేస్తోంది. ఫస్ట్ హాఫ్ ఫన్ అండ్ రైడ్ గా సాగిన మూవీ.. సెకండాఫ్ ఎమోషనల్ గా సాగిపోతుంది. మొత్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. వాళ్ల లగ్జరీ లైఫ్.. విదేశాల్లో ఉంటే గొప్ప అనుకునే ఇప్పటి తల్లిదండ్రుల ఆలోచనకు ప్రతిబింబంగా నిలిచింది. మొత్తంగా రమేశ్ చెప్పాల తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతో అర్థవంతంగా తెరపై ఆవిష్కరించాడు. ఈ సినిమాకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలో సన్నివేశాలకు తగ్గ పాటలు ఆకట్టుకున్నాయి. అక్కడక్కడ సినిమాను ట్రిమ్ చేసుంటే బాగుండేది.
ఇదీ చదవండి: Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..
నటీనటుల విషయానికొస్తే..
నటీనటుల విషయానికొస్తే.. రాజేంద్ర ప్రసాద్ తన నటనతో మెప్పించాడు. రోహిణి క్యారెక్టర్ తన పరిధి మేరకు మెప్పించాడు. రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ యాసలో అదరగొట్టాడు. మిగిలిన నటీనటుల కొంత మంది తెలంగాణ యాసలో కొంచెం తడబడ్టట్టు కనిపించింది.హీరో సాయి రోనక్ ఉన్నంతలో బాగానే నటించారు. హీరోయిన్ గా నటంచిన ప్రగ్యా పర్వాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
కథనం, డైరెక్షన్
నిర్మాణ విలువలు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్స్ ల్యాగ్
నటీనటుల తెలంగాణ యాస
పంచ్ లైన్.. ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించే ‘లగ్గం’..
రేటింగ్: 3/5
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter