Burning Train: కదులుతున్న రైలింజన్‌లో మంటలు, భయంతో జనం పరుగులు, ఆ తరువాత ఏమైంది

Burning Train: బర్నింగ్ ట్రైన్..ఇదేదో సినిమా పేరు అన్నుకున్నారా. కానేకాదు. నిజంగానే మంటలతో పరుగెడుతున్న రైలిది. రైల్వే స్టేషన్ సమీపంలో పొగతో పాటు రేగిన మంటలు కలకలం కల్గించాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2022, 04:05 PM IST
Burning Train: కదులుతున్న రైలింజన్‌లో మంటలు, భయంతో జనం పరుగులు, ఆ తరువాత ఏమైంది

Burning Train: బర్నింగ్ ట్రైన్..ఇదేదో సినిమా పేరు అన్నుకున్నారా. కానేకాదు. నిజంగానే మంటలతో పరుగెడుతున్న రైలిది. రైల్వే స్టేషన్ సమీపంలో పొగతో పాటు రేగిన మంటలు కలకలం కల్గించాయి.

ఆ ట్రైన్ రైల్వే స్టేషన్‌కు చేరుతోంది. దగ్గరకు రాగానే ఒక్కసారిగా ఇంజన్ పైభాగం నుంచి పొగతో పాటు మంటలు పైకి ఎగిశాయి. అంతే జనంలో కలకలం. అటూ ఇటూ పరుగులంకించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంజన్ పైభాగం నుంచి మంటలు రావడం స్పష్టంగా చూడవచ్చు.

సోషల్ మీడియాలో రైళ్లకు సంబంధించి పలు ఆసక్తి కల్గించే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనం భయపడిపోతున్నారు. ఇందులో ఓ రైలు స్టేషన్‌కు చేరగానే..ఇంజన్ పైభాగం నుంచి పొగతో పాటు ఒక్కసారిగా మంటలు పైకి ఎగిశాయి. భయంతో జనం అటూ ఇటూ పరుగులెట్టారు. రైలు మంటల్లో చిక్కుకుందనుకున్నారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు.

వాస్తవానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్కడిదనేది ఇంకా స్పష్టత లేదు. కానీ వేగంగా వైరల్ అవుతోంది. స్టీమ్ ఇంజన్‌తో నడుస్తున్న ఒక ట్రైన్ స్టేషన్‌కు చేరుకోగానే ఒక్కసారిగా ఇంజన్ పైభాగం నుంచి మంటలు రావడం స్పష్టంగా చూడవచ్చు. రైలింజన్‌లో మంటలు అలముకున్నాయని అంతా భయపడిపోయారు. కానీ అలా జరగలేదు. స్టీమ్ ఇంజన్‌లో మండుతున్న బొగ్గు నుంచి ఈ మంటలు ఒక్కసారిగా వచ్చాయి. అందుకే కాస్సేపటికి మంటలు ఆగిపోవడం, రైలు ముందుకెళ్లిపోవడం కూడా గమనించవచ్చు. నిశితంగా గమనిస్తే ఇదొక పాత వీడియోలా అన్పిస్తుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by m a m (@imamryntfznn)

రైళ్లు వైరల్ అవడం ఇదేమీ తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం పాకిస్తాన్‌కు చెందిన ఒక ట్రైన్ డ్రైవర్ పెరుగు కొనేందుకు ఏకంగా రైలునే ఆపేశాడు. ఇది లాహోర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఇటు ఇండియాలో కూడా ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ఒక ట్రైన్ డ్రైవర్ కచౌడీ తినేందుకు ట్రైన్ నిలిపేశాడు. 

Also read: Python Viral Video: కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు.. నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News