Chandrayaan 3 Lift off Video: విమానంలోంచి షూట్ చేసిన చంద్రయాన్ 3 వీడియో

Chandrayaan 3 Lift off Video: 1970-1980 మధ్యలో అనుకుంటా.. అప్పట్లో సూర్య గ్రహణం గమనాన్ని ఆకాశంలోంచి తమ కెమెరాల్లో బంధించి వాటిని అధ్యయనం చేసేందుకు ఔత్సాహికులైన ఒక శాస్త్రవేత్తల బృందం కాన్‌కర్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్లి ఆకాశంలో విహరించి వచ్చారట. తాజాగా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 విషయంలో కూడా ఇంచుమించు అలాంటిదే జరిగింది. 

Written by - Pavan | Last Updated : Jul 16, 2023, 08:41 AM IST
Chandrayaan 3 Lift off Video: విమానంలోంచి షూట్ చేసిన చంద్రయాన్ 3 వీడియో

Chandrayaan 3 Lift off Video: 1970-1980 మధ్యలో అనుకుంటా.. అప్పట్లో సూర్య గ్రహణం గమనాన్ని ఆకాశంలోంచి తమ కెమెరాల్లో బంధించి వాటిని అధ్యయనం చేసేందుకు ఔత్సాహికులైన ఒక శాస్త్రవేత్తల బృందం కాన్‌కర్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్లి ఆకాశంలో విహరించి వచ్చారట. తాజాగా ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 విషయంలో కూడా ఇంచుమించు అలాంటిదే జరిగింది. కాకపోతే ఇదేమీ అప్పట్లో శాస్త్రవేత్తలు చేసినట్టుగా ప్రీ ప్లాన్ చేసినది కాదు. యాధృచ్ఛికంగానే జరిగింది. 

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జులై 14న శుక్రవారం నాడు మధ్యాహ్నం సరిగ్గా 2.35 గంటలకు చంద్రయాన్ 3 ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో చెన్నై నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ పైలట్ ఆ విషయాన్ని విమానంలోని ప్రయాణికులకు అందరికీ ఒక ఎనౌన్స్ మెంట్ ద్వారా తెలియజేశాడు. ఆకాశంలోంచే ఆ దృశ్యాన్ని చూసి తిలకించేందుకు ప్రయాణికులు కూర్చున్న చోటు నుంచే విమానం కిటికీల్లోంచి బయటకు చూడొచ్చని తెలిపాడు. అలా చెన్నై - ఢాకా ఇండిగో ఫ్లైట్ లోంచి ఓ ప్రయాణికుడు తన మొబైల్ కెమెరాలో బంధించిన దృశ్యమే ఇది.

మీరు ఇప్పటి వరకు నేలపై నుంచి షూట్ చేసిన రాకెట్ లాంచింగ్ వీడియోలనే చూసి ఉండి ఉంటారు కానీ రాకెట్‌కి సమానంగా ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలోంచి రికార్డు చేసిన వీడియో ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఇదిగో ఇటువైపు ఒక లుక్కేయండి మరి. 

ఇది కూడా చదవండి : Side Effects of Red Bull: రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌తో భరించలేని అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్

ఈ దృశ్యాన్ని చెన్నై స్కైస్ అనే ట్విటర్ ఖాతా నుంచి ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. విమానయానం, అంతరిక్షం ఒక్క చోట కలిస్తే ఇలా ఉంటుంది అనే అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్ కూడా ఆ దృశ్యానికి సరిగ్గా సూట్ అయింది. చంద్రయాన్ - 3 రాకెట్ ఈ విమానం ప్రయాణిస్తున్న ఎత్తును దాటేసే క్రమంలో విమానంలోని ప్రయాణికులకు కంటపడిన దృశ్యంగా ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. అన్నట్టు ఈ అరుదైన దృశ్యాన్ని మీరు మాత్రమే చూసి సరిపెట్టుకోకుండా మీ స్నేహితులతోనూ షేర్ చేసుకోండి.

ఇది కూడా చదవండి : Side Effects of Maggi: మ్యాగీ తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌లో ప్రాణాంతకమైన జబ్బు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News