ట్రెడ్‌మిల్‌పై టీనేజీ పిల్ల స్టెప్పులు.. నెటిజెన్స్ ఫిదా!

ట్రెడ్‌మిల్‌పై టీనేజీ గాళ్ స్టెప్పులు 

Last Updated : May 30, 2018, 06:28 PM IST
ట్రెడ్‌మిల్‌పై టీనేజీ పిల్ల స్టెప్పులు.. నెటిజెన్స్ ఫిదా!

సాధారణంగానే ట్రెడ్‌మిల్‌పై వర్కౌట్స్ చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన పని. ప్రాక్టీస్ అయ్యాకా మామూలే అయినా.. కొత్తలో మాత్రం ఎవరైనా ఇబ్బంది పడిన సందర్భాలే అధికం. అయితే, అదే సమయంలో  ట్రెడ్‌మిల్‌పై ఎంత ప్రాక్టీస్ వున్నా.. వర్కౌట్స్ చేసే సమయంలో ట్రెడ్‌మిల్‌పై నిర్లక్ష్యం వహిస్తే, దానిపై జారిపడక తప్పదు. ఒకవేళ ఆ సమయంలో ట్రెడ్‌మిల్ కానీ వేగంగా వున్నట్టయితే, అది వర్కౌట్స్ చేస్తూ బ్యాలెన్స్ తప్పిన వారిని మిషన్‌కి దూరంగా విసిరికొట్టిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. అందుకే ట్రెడ్‌మిల్‌పై ఎక్సర్‌సైజ్ కాస్త క్లిష్టమైనదే అంటుంటారు దానితో చేదు అనుభవాలు ఎదుర్కున్న వారు. అయితే, ఇదిగో ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి మాత్రం ట్రెడ్‌మిల్‌పై అలవోకగా వర్కౌట్స్ చేయడమే కాకుండా పంజాబీ పాటకు స్పెప్పులు కూడా వేస్తోంది. పాటకు అనుగుణంగా ట్రెడ్‌మిల్‌పై బాడీని షేక్ చేస్తోన్న ఈ నాజూకు టీనేజ్ బేబీ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సంచలనంగా మారింది. 

 

నాలుగైదు రోజుల క్రితం మేరా పంజాబ్ అనే ఫేస్‌బుక్ పేజీపై ప్రత్యక్షమైన ఈ వీడియోకు అప్పుడే 1.5 మిలియన్ వ్యూస్ సొంతమవడంతోపాటు 25వేలకుపైగా యూజర్స్ షేర్ చేసుకున్నారంటే పిల్ల డ్యాన్స్‌కి నెటిజెన్స్ ఎంత ఫిదా అయ్యారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు మరి!!

Trending News