Google servers down: గూగుల్ సర్వర్స్ డౌన్ అవడానికి కారణాలేంటి ?

గూగుల్ సర్వర్స్ డౌన్ అవడంతో యావత్ డిజిటల్ ప్రపంచం ఒక గంటసేపు మూగబోయింది. ప్రపంచం నలుమూలలా కొన్ని కోట్ల మంది యూజ‌ర్లు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫోటోలు వంటి క్లౌడ్ సర్వీసెస్ అన్నీ క్రాష్ అయ్యాయి.

Last Updated : Dec 15, 2020, 05:25 AM IST
Google servers down: గూగుల్ సర్వర్స్ డౌన్ అవడానికి కారణాలేంటి ?

గూగుల్ సర్వర్స్ డౌన్ అవడంతో యావత్ డిజిటల్ ప్రపంచం ఒక గంటసేపు మూగబోయింది. ప్రపంచం నలుమూలలా కొన్ని కోట్ల మంది యూజ‌ర్లు ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫోటోలు వంటి క్లౌడ్ సర్వీసెస్ అన్నీ క్రాష్ అయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి దిగ్గజంగా పేరున్న గూగుల్ సంస్థకు చెందిన సర్వర్స్ డౌన్ అవడం కొంతమంది అయోమయానికి గురిచేస్తే.. ఇంకొంతమందిని ఆలోచింపచేసింది. గంట తర్వాత గూగుల్ సర్వీసెస్ మళ్లీ యధావిధిగా రిస్టోర్ అయ్యాయి. 

గూగుల్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాకా హాయిగా గూగుల్ చేసుకుంటూ తమ పని తాము కానిచ్చిన వాళ్లు కొందరైతే... ఇంతకీ గూగుల్ సర్వర్స్ డౌన్ అవడానికి కారణం ఏంటంటూ అదే గూగుల్‌లో ఆరాతీస్తూ ఇంకొందరు నెటిజెన్స్ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో గూగుల్ సర్వర్స్ క్రాష్ అవడానికి గల కారణాలు ఏంటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిసింది ఏంటంటే... 

గూగుల్ స్పోక్స్ పర్సన్ గూగుల్ సర్వర్స్ డౌన్ అవడంపై స్పందిస్తూ.. ఇంటర్నల్ స్టోరేజ్ కోటాలో తలెత్తిన లోపం వల్లే ఈ సమస్య ఎదురై ఉండొచ్చని సందేహం వ్యక్తంచేశారు.

Also read : Google Top Searches of 2020: గూగుల్ టాప్ సెర్చ్‌లో ఇవే టాప్ అంశాలు..ఏమున్నాయో తెలిస్తే

సాధారణంగా ఏయే పరిస్థితుల్లో సర్వర్స్ క్రాష్ అవుతుంటాయనే విషయంలో ఓసారి దృష్టిసారించినట్టయితే... సర్వర్ల నిర్వహణలో, లేదా కోడింగ్‌లో ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు ఆ మానవ త‌ప్పిదం కార‌ణంగా సర్వర్స్ క్రాష్ అవుతుంటాయి. నేడు గూగుల్ సర్వర్స్ డౌన్ ( Google servers crashed ) అయిన విషయంలో జరిగింది కూడా అటువంటిదే అయ్యుండవచ్చు అని మొదట సైబర్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేశారు. 

అలాగే సర్వర్స్ సెక్యురిటీలో లోపాలు ఉన్నట్టయితే.. ఆ లూప్ హోల్స్‌ని ఆధారంగా చేసుకుని హ్యాకర్స్ సైబ‌ర్ దాడులకు ( Cyber attacks ) పాల్పడే ప్ర‌మాదం ఉంటుంది. అదే కానీ జరిగితే సైబర్ దాడి తీవ్రతను బట్టి ఒక్కోసారి సర్వర్స్ రిస్టోర్ అయ్యే సమయం కూడా పెరగొచ్చు.

సర్వర్స్ వర్కింగ్ డేటా సెంట‌ర్‌లో ఉన్న మెషినరిలో ఏమైనా లోపాలు తలెత్తినట్టయితే.. ఆ లోపాలు సర్వర్స్‌పై పడతాయి. ఫలితంగా స‌ర్వ‌ర్లు క్రాష్ అయ్యే ప్రమాదం ఉంటుంది. 

ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో ఉన్న బ‌గ్స్ ( Bugs in OS ) కూడా స‌ర్వ‌ర్లు డౌన్ అవ‌డానికి కారణం అవుతాయి అంటున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్. సర్వర్స్‌ క్రాష్ అయ్యేలా చేసిన బగ్స్‌ని గుర్తించి డీబగ్ ( Debugging ) చేసేంతవరకు సర్వర్స్ రిస్టోర్ అవడం అసాధ్యం.

Also read : SBI alert: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News