ఆ వ్యక్తికి ప్రాణాలకంటే చెప్పులు ఎక్కువైపోయాయి. చెప్పుల కోసం వెనక్కి వెళ్లి..ట్రైన్ కింద పడబోయాడు. ఎక్కడో అదృష్ణం బాగున్నట్టుంది. కేవలం సెకన్ అంటే సెకన్ వ్యవధిలో సేవ్ అయ్యాడు. లేకపోతే ఈ పాటికి ఆ వ్యక్తి ప్రాణం పైకెళ్లిపోయేది.
మనచుట్టూ ఉండే చాలామంది నియమాల్ని పాటించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. వారి క్షేమం కోసం పెట్టిన నియమాల్నే తుంగలో తొక్కేస్తుంటారు. జీవితంలో షార్ట్ కట్ అలవాటైనవాళ్లే ఇలా చేస్తుంటారు. ఇలా చేసే పొరపాట్లే జీవితాన్ని మూల్యంగా చెల్లించుకోవల్సిన పరిస్థితికి దారితీస్తాయి. ఈ వీడియో చూస్తే అదే తెలుస్తుంది.
ఓ వ్యక్తి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ మారేందుకు చేసిన ప్రయత్నం ఆ వ్యక్తి ప్రాణాల్ని సెకన్ వ్యవధిలో తప్పేలా చేసింది. వంతెన పైనుంచి దాటకుండా..షార్ట్‌కట్ అవలంభించబోయాడు. వేగంగా వస్తున్న ట్రైన్ కింద పడబోయి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్ధమౌతుంది.
आपके जूते से ज्यादा आपकी जान की क़ीमत है,
जुतों का क्या है वो तो बाजार में दोबारा मिल जाएगा
पर आपकी जान दोबारा नहीं मिलेगी 🙏❤️ pic.twitter.com/u48ZhXTooN— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 14, 2022
ఓ వ్యక్తి పట్టాలమీంచి ప్లాట్‌ఫామ్ దాటుతుంటాడు. మద్యలో ఉన్న ఫెన్సింగ్ దూకేస్తాడు. రెండవ ట్రాక్ దాటుతుండగా..కాళ్ల నుంచి చెప్పులు మిస్ అవుతాయి. వెనక్కి వచ్చి చెప్పులేసుకుని మళ్లీ..దాటబోతాడు. అంతలో ట్రైన్ వచ్చేస్తుంది. కేవలం సెకన్ అంటే సెకన్ వ్యవధిలో ప్లాట్‌ఫామ్‌పై ఎక్కేస్తాడు. అది కూడా అక్కడున్న ఓ వ్యక్తి సహాయంతో..రెప్పపాటు వ్యవధిలో ఆ వ్యక్తి మృత్యువు నుంచి తప్పించుకుంటాడు. ఈలోగా ట్రైన్ కూడా సడెన్ బ్రేక్‌తో ఆగుతుంది. ఈ వీడియో చూస్తుంచే..గుండెలదిరిపోతాయి.
ఈ వీడియోను ట్విట్టర్‌పై షేర్ చేయగానే అందరూ ఆ వ్యక్తిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 22 సెకన్ల ఈ వీడియోను ఇప్పటికే వేలాదిమంది వీక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo