OMG Video: యువకుడిపై కుక్కల గుంపు దాడి, అతడు ఎలా తప్పించుకున్నాడో తెలిస్తే కళ్లు తిరుగుతాయ్..

Viral Video today: ఒక్కసారిగా కుక్కల గుంపు మీద పడిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఆ పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో తెలుసా? అయితే ఈ వీడియో చూసేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 05:26 PM IST
  • వ్యక్తిపై కుక్కల గుంపు దాడి
  • చాకచాక్యంగా తప్పించుకున్న యువకుడు
OMG Video: యువకుడిపై కుక్కల గుంపు దాడి, అతడు ఎలా తప్పించుకున్నాడో తెలిస్తే కళ్లు తిరుగుతాయ్..

Viral Video today: సోషల్ మీడియా (Social Media) రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే... ఒక వ్యక్తి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్లాక సడన్ గా ఓ కుక్కల గుంపు అతడిని చుట్టు ముడతాయి. వెంటనే అతడిపైకి దాడి తెగ బడతాయి. ఆ టైంలో ఎవరైనా అయితే ప్రాణాలు గాలికొదిలేస్తారు. కానీ ఆ యువకుడు ఆ కుక్కలకు భయపడడు. చాలా చాకచాక్యంగా వాటితో ఆడుకుంటాడు. కాళ్లు, చేతులను చాలా వేగంగా కదుపుతూ వాటి నుంచి తప్పించుకుంటాడు. నిజంగా ఇక్కడ ఆ యువకుడి ధైర్యాన్ని మెుచ్చుకుని ఉండి తీరాల్సిందే. ఎందుకంటే దాదాపు ఒక ఎనిమిది కుక్కలు కరవడానికి వస్తుంటే ఆ కుర్రాడు పారిపోకుండా వాటిని అడ్డుకున్న విధానానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Memes | Drama | Wholesome 🫂 (@18plusguyy)

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.  బ్రూస్ లీ అంటూ ఒకరు కామెంట్ చేస్తే... ఫైటర్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. 

Also Read: Trending video: ఎదురుపడ్డ పాము-ముంగిస, తర్వాత ఏం జరిగిందంటే...

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News