Uttar Pradesh: రోడ్డుపైన ఘోరం.. వర్షంలో తడిచిన మహిళ మీద నీళ్లు చల్లుతూ, అసభ్యంగా తాకుతూ.. వీడియో వైరల్..

Goons water thrown in lucknow: బైక్ వెళ్తున్న జంట పట్ల ఆకాతాయిలు పైశాచీకంగా ప్రవర్తించారు. నీళ్లు పోస్తు ఇష్టమున్నట్లు ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 31, 2024, 08:48 PM IST
  • లక్నోలో రోడ్లపై నిలిచిపోయిన నీళ్లు..
  • బైకర్ మీద దాడిచేసిన ఆకతాయిలు..
Uttar Pradesh: రోడ్డుపైన ఘోరం.. వర్షంలో తడిచిన మహిళ మీద నీళ్లు చల్లుతూ, అసభ్యంగా తాకుతూ.. వీడియో వైరల్..

Goons misbehave with woman and water thrown in lucknow uttar Pradesh:  కొన్నిరోజులుగా వర్షం దంచికొడుతుంది. ఈ క్రమంలో నదులు, చెరువులు ,ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. రోడ్లన్ని ఎక్కడ చూసిన బురద మయంగా మారాయి. వర్షంలో అత్యవసరమైతే తప్ప బైటకు రావద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగాలకు వెళ్లేవారు, తప్పనిసరి పనులకు వెళ్లే వాళ్లు మాత్రం నానా ఇబ్బందులు పడి మరీ వెళ్తున్నారు.  కొంత మంది ఆకతాయిలు యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడైన ఆడది కనపడితేచాలు రెచ్చిపోతుంటారు.

 

జంతువుల కన్నా.. హీనంగా ప్రవర్తిస్తారు. రోడ్డుపైన , బస్టాండుల్లో , మెట్రోల్లో తరచుగా మహిళలు వేధింపులకు గురైన ఘటనలు, వీడియోలు వార్తలలో ఉంటునే ఉంటాయి. కొందరు కామాంధులు మహిళలను తాకుతూ పైశాచీక ఆనందాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో మహిళలు ప్రతిరోజు వేధింపుల ఘటనలు వార్తలలో ఉంటునే ఉంటాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

పూర్తి వివరాలు.. 

ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. లక్నోలోని తాజ్ హోటల్ సమీపంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ కుండపోతగా వర్షంకురుస్తుండటంతో.. రోడ్లన్ని జలమయమైపోయాయి. ప్రయాణికులు రోడ్లపై ప్రయాణించేందుకు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. రోడ్డుపై కొందరు ఆకతాయిలు నీళ్లతో సరదాగా ఆడుకుంటున్నారు. ఇంతలో అక్కడి నుంచి ఒక జంట బైక్ మీద వెళ్తున్నారు.

వీరిని చూడగానే ఆకతాయిలు రెచ్చిపోయారు. వీరిపై బురద నీళ్లు చల్లుతూ, బైక్ ను వెనుకకు లాగేశారు. అంతేకాకుండా.. మహిళను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు.  చివరకు బైక్  ను కింద పడేశారు.  దీంతో బైకర్ ఆవేశంతో ఆకతాయిలో మీద తిరగబడ్డాడు. దూరంగా ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆకతాయిల మీద చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

 యూపీ రాజధాని లక్నో, చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం మంచి వర్షం కురిసింది. అయితే, వర్షం కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లక్నోలో గోమతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ పార్క్ తాజ్ హోటల్ సమీపంలోని రోడ్డు కూడా జలమయం కావడంతో పాదచారులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇంతలో కొందరు అదుపుతప్పిన యువకులు అదే నీటిలో సరదాగా గడిపి, ప్రవహిస్తున్న నీటిని బాటసారులపై పోయడం ప్రారంభించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News