tina dabi controversy greetings to rajasthan bjp leader video viral: ఇటీవల కాలంలో అఖిల భారత సర్వీసుల అధికారులైన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు తరచుగా వార్తలలో ఉంటున్నారు. కొంత మంది అప్పుడున్న సర్కారుకు ఫెవర్ లు చేస్తు వివాదాస్పద మౌతున్నారు. కానీ కొంత మంది మాత్రం ముక్కుసూటిగా ఉంటూ.. కేవలం తమ పరిధిలో ఉన్న డ్యూటీలను చేస్తు డైనమిక్ గా ఉంటున్నారు. కొంత మంది మాత్రం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండటంతో అందరికి చెడ్డపేరు వస్తుందని చెప్పుకొవచ్చు .
सर झुकाने में तो कोई दिक्कत नहीं है, जननेता ब्यूरोक्रेट से ऊपर ही हैं।#TinaDabi का ये व्यवहार उनके बेहतर व्यक्तित्व और शालीनता का परिचायक है।
pic.twitter.com/LgLp3kU4uV— Kanwar Gurjar🚩(कंवर सिंह जांगल) (@mr_gurjar29) October 25, 2024
ఈ నేపథ్యంలో గతంలో టీనాదాబీ తన రెండో పెళ్లితో వార్తలలో నిలిచారు. ఆమె మొదటి పెళ్లిని రద్దు చేసుకుని మరల మరో ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను రెండో వివాహాం చేసుకున్నారు. ఆమె చిన్న వయస్సులోనే సివిల్స్ లో ర్యాంక్ సాధించడంతో పాటు.. దేశంలో ఉన్న అందమైన ఐఏఎస్ అధికారిణుల్లో కూడా ఒకరిగా ఫెమస్ అయ్యారు. ఈనేపథ్యంలో తాజాగా, టీనాదాబి రాజస్థాన్ లోని బార్మర్ కు బదిలీ అయ్యారు. ఇటీవల ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాకు చెందిన ఐఏఎస్ టీనాదాబి వార్తలలో నిలిచారు. తాజాగా, రాజస్థాన్ కు చెందిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత సతీష్ పూనియాకు ఆమె అభివాదం చేస్తూ కనిపించారు. పూనీయా.. బార్మర్ కు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ సందర్భంలో.. కలెక్టర్ ఆయన ముందుకు వెళ్లడం.. వంగి వంగి.. పలు మార్లు విష్ చేయడం మాత్రం వివాదస్పదంగా మారినట్లు తెలుస్తొంది.
మిస్టర్ పూనియా తన వాహానంలో నుంచి తన ఫోన్‌ని చూసుకుంటున్నారు. కనీసం అక్కడున్న అధికారిణిని గమనించలేదు. కానీ ఐఏఎస్ టీనా దాబి మాత్రం.. ఏడు సెకన్లలో ఐదుసార్లు నాయకుడికి వంగి వంగి నమస్కరించిననట్లు తెలుస్తొంది. ఆ తర్వాత పూనీయా సరదాగా మాట్లాడుతూ.. మీరు " దాదైగిరి కర్ రహే హో (మీరు బెదిరింపులు చేస్తున్నారు)," అని అతను చమత్కరంతో మాట్లాడినట్లు తెలుస్తొంది. కానీ.. " లేకిన్ అచ్ఛా కామ్ కర్ రహే హో (కానీ మీరు మంచి పని చేస్తున్నారు) బార్మర్ కూడా ఇండోర్ లాగా మారుతుందని మంచిగా పనిచేస్తున్నారని కూడా చమత్కారంతో మాట్లాడతారు.
అయితే.. ఈ వీడియో వైరల్ గా మారడంతో అక్కడ అపోసిషన్ పార్టీల నేతలు మాత్రం.. టీనాదాబీ తీరును మాత్రం తప్పుపట్టినట్లు తెలుస్తొంది. ముఖ్యనేతల్ని విష్ చేయడం వారికి ప్రొటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వడంలో తప్పులేదు. కానీ..ఇలా వంగి వంగి పదే పదే విష్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారంట.
Read more: Viral Video: బాప్ రే.. బెడ్ రూమ్‌లో రొమాన్స్ చేసుకుంటున్న పాములు.. షాకింగ్ వీడియో వైరల్..
మరికొంత మంది అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు కొంత మంది రాజకీయ నాయకుల్ని ప్రసన్నం చేసుకునేందుకు.. అతి వినయంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబని కూడా కామెంట్లు చేస్తున్నారంట. మొత్తానికి టీనా దాబి మాత్రం మరోసారి వార్తలలో నిలిచినట్లు తెలుస్తొంది.
<
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.