Ig Nobel Prize-2021: 'జలుబు నివారణకు శృంగారమే మందు'..పరిశోధకులకు 'ఇగ్ నోబెల్'..

Ig Nobel: నోబెల్ ప్రైజ్ గురించి మనందరికీ తెలుసు. ఏదైనా రంగంలో విశేషంగా  కృషి చేసిన వారికి ఇస్తారు. నోబెల్ కానీ నోబెల్ ఒకటుంది..అదే ఇగ్ నోబెల్. 2021 సంవత్సరానికి సంబంధించి ఇగ్​ నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. అసలు నోబెల్‌కు దీనికి ఏంటి తేడా? అసలు ఈ ఇగ్‌ నోబెల్‌ ఎందుకు ఇస్తారు? ఎవరు ఇస్తారో తెలుసుకుందామా!

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 05:23 PM IST
Ig Nobel Prize-2021: 'జలుబు నివారణకు శృంగారమే మందు'..పరిశోధకులకు 'ఇగ్ నోబెల్'..

ig nobel 2021: 'ఇగ్​ నోబెల్' అనేది ఓ 'సెటైరికల్'​ ప్రైజ్​. అంత ముఖ్యమైనవి కాని అంశాలు, ప్రయోగాలకు ఈ ఇగ్‌ నోబెల్ బహుమతులు ఇస్తుంటారు. ఇందులో కొన్ని నవ్వు తెప్పిస్తాయి. మరి కొన్ని కాస్త ఆలోచింపజేస్తాయి. ఈ ప్రైజ్ ను 1991 నుంచి ప్రతి ఏటా ఇస్తున్నారు.  వీటిని మార్క్‌ అబ్రహామ్స్‌ (Mark Abrahams)ప్రారంభించారు. ఈ అవార్డులను ఏటా హార్వర్డ్‌ యూనివర్సిటీలో శాండర్స్‌ థియేటర్‌లో ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌(online)లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఐఆర్​(ఆనల్స్​ ఆఫ్​ ఇంప్రాబబుల్​ రీసర్చ్​) మేగజైన్​ ఈ అవార్డులు అందిస్తుంది.

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, వైద్యం, సాహిత్యం, శాంతి విభాగాలతో పాటు ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌, బయాలజీ ఇలా పది విభాగాల్లో ఇగ్‌ నోబెల్‌ అవార్డ్సు(ig nobel Awards) ఇస్తారు. ‘గెలిచిన వారికి నగదు బహుమతి కూడా ఉంటుంది. అది ఏంటంటే.. చెల్లని 10 ట్రిలియన్‌ జింబాబ్వే డాలర్ల కరెన్సీ నోటు ఇస్తారు. ట్రోఫీగా ఏమిస్తారో తెలుసా.. పీడీఎఫ్‌ను ప్రింట్‌ తీసి ఇస్తారు. దాన్ని విజేతలే ట్రోఫీగా మార్చుకోవాల్సి ఉంటుంది. ‘ignoble ’ అనే ఆంగ్లపదం స్ఫూర్తితోనే ఈ బహుమతికి ఇగ్‌ నోబెల్‌ అని పేరు పెట్టారట!
31వ వార్షిక ఇగ్ నోబెల్(ig nobel 2021)​ పురస్కారం వేడుకలు ఇటీవలే వర్చువల్​గా(ig nobel award ceremony) జరిగాయి. 

Also Read: Ruby Roman grapes: ఈ గ్రేప్స్​ మస్త్‌‌ కాస్ట్‌‌లీ గురూ...! ఒక్క ద్రాక్ష పండు రూ.35 వేలు..! ఎందుకంటే..

2021 Ig Nobel Prizes Winners:

బయోలజీ: మనిషి, పిల్లి మధ్య ఉండే సమాచార వ్యవస్థపై పరిశోధనలు చేసిన సుసేన్​ స్కాట్జ్​కు ఈ అవార్డు దక్కింది. వివిధ సందర్భాల్లో వేరువేరుగా సంభాషించేందుకు పిల్లులు తమ స్వరాన్ని మార్చుకుంటాయని ఆ పరిశోధనలో తేలింది.

ఎకాలజీ: ప్రపంచవ్యాప్తంగా రోడ్ల మీద వాడిపడేసిన చూయింగ్​ గమ్​లను సేకరించి, జన్యు విశ్లేషణతో వాటిలోని బ్యాక్టీరియాను గుర్తించిన లైలా సటారా, ఆల్బా గుయిలెన్​, ఏంజెలో విడాల్​, మాన్యుయెల్​ పోర్​కర్​ను ఈ అవార్డు వరించింది. వీటి ఫలితాలను(వీరు రూపొందించిన డీఎన్​ఏ డేటాబేస్​ను) భవిష్యత్తులో ఫోరెన్సిక్​ పరిశోధనలకు ఉపయోగించుకోవచ్చు.

కెమిస్ట్రీ: జార్జ్​ వికర్​,నికోలస్​ క్రాటెర్​, బెటిటిన డెర్​స్ట్రోఫ్​, క్రిస్టోఫ్​ స్టోనర్​, ఎఫ్​స్ట్రాషియోస్​ బౌర్​స్టోకిడిస్​, ఆచిమ్​ ఎడ్​బౌర్​, జోచెమ్​ ఉల్ఫ్​, థామస్​ క్లుఫెల్​, స్టీఫెన్​ క్రామర్​, జోనాథన్​ విలియమ్స్​కు ఈ అవార్డు దక్కింది. సినిమా థీయేటర్లలో ప్రేక్షకుల నుంచి వెలువడే వాయువుల ఆధారంగా ఎలాంటి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారో కనుగొనవచ్చా? అన్న అంశంపై వీరి పరిశోధనలు జరిగాయి. ఫలితాలు ప్రస్తుతానికి అంత నమ్మశక్యంగా లేకపోయినా.. భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

ఎకనామిక్స్​: రాజకీయ నేతల ఊబకాయానికి, వారి దేశంలో అవినీతికి మధ్య సంబంధం ఉన్నట్టు కనుగొన్నారు పావ్లో బ్లావట్​స్కీ. అయితే.. వ్యక్తిగతంగా చూస్తే... సన్నగా ఉండే రాజకీయ నేతల కన్నా లావుగా ఉండే నాయకులు ఎక్కువ అవినీతిపరులని చెప్పలేమన్నారు.

మెడిసిన్​: జలుబు చేస్తే చాలా మందికి ముక్కు మూసుకుపోతుంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అయితే ఆ సమయంలో శృంగారం చేసి భావప్రాప్తి పొందితే.. శ్వాస ప్రక్రియ కొంత సులభమవుతుందని ఓక్లే కెమ్​ బులుట్​, డేర్​ ఒలాడోకుమ్​, బర్కడ్​ లిప్పెర్ట్​, రాల్ఫ్​ హోహెన్​బర్గ్​ పరిశోధనల్లో తేలింది. వీరికి ఈ అవార్డు లభించింది.

శాంతి పురస్కారం: గడ్డం బాగా పెంచినవారి ముఖం మీద కొడితే దెబ్బ తీవ్రత తక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. క్లీన్​ షేవ్​ చేసుకున్న వారి కన్నా ఎక్కువ గడ్డం ఉన్న వారికి దీని వల్ల కొంత లాభమని స్పష్టమైంది. గడ్డం ఉన్న చర్మం.. గతి శక్తిని ఎక్కువగా శోషించుకుంటుందని తేల్చిన ఈ పరిశోధనల్లో పాల్గొన్న ఎథెన్​ బిసెరిస్​, స్టీవెన్​ నాల్​వే, డేవిడ్​ కారియర్​కు ఈ అవార్డు దక్కింది.

ఫిజిక్స్​: పాదచారులు రద్దీ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడూ ఎందుకు పరస్పరం ఢీ కొట్టుకోరు? అన్న అంశంపై పరిశోధనలు జరిపిన అలెసాండ్రో కార్బెట్టా, జాస్ఫర్​ మూసెన్​, ఛాంగ్​-మిన్​ లీ, రాబెర్టో బెన్జీ, ఫెడెరికో టాస్చికి ఈ అవార్డు వరించింది.

ఎంటమాలాజీ: జలాంతర్గముల్లోకి దూరే బొద్దింకలను చంపేందుకు పలు పద్ధతులపై పరీక్షలు నిర్వహించి, అధ్యయనం చేసిన జాన్​ ముల్​రెన్నాన్​, రాజర్​ గ్రోథస్​ జూనియర్​, ఛార్లెస్​ హామ్మండ్​, జయ్​ లాండిన్​లకు ఈ అవార్డు దక్కింది.

ట్రాన్స్​పోర్టేషన్​: ఖడ్గమృగాలను రవాణా చేసే సమయంలో వాటికి మత్తుమందులిచ్చి, అడ్డంగా పడుకోపెడతారు వన్యప్రాణుల సంరక్షకులు. అయితే రవాణా సమయంలో వాటికి మత్తుమందు ఇచ్చి, వాటి కాళ్లను గాల్లో తలకిందులుగా పెట్టి తీసుకెళితే నష్టమా? అన్న ప్రశ్నకు సమాధానం కనుగొనే విధంగా పరిశోధనలు చేసిన రాబిన్​ రాడ్​క్లిఫ్​, మార్క్​ జెగో, పీటర్​ మార్కెల్​, ఎస్టెల్​ మార్కెల్​, పిర్రీ డు ప్రీజ్​, పీట్​ బెయ్​టెల్​, కాటింగ్​, బాకర్​ మాన్యుయెల్​, జాన్​ హెనడ్రిక్​, మిషెల్​ మిల్లర్​, జులియా ఫిలిప్పి, స్టీఫెన్​ పెర్రి, రాబిన్​ గ్లీడ్​కు ఈ అవార్డు వరించింది. అలా తలకిందులుగా తీసుకెళితే ఖడ్గమృగాలకు ఎటువంటి నష్టం జరగకపోగా, అవి మరింత ఉపశమనం పొందుతాయని పరిశోధనలో తేలింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News