HBD Nandamuri Mokshagna: బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ఆసక్తికర విషయాలు..

Mokshagna Debut: నందమూరి వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు ఈ రోజు.  ఆయన తన మొదటి సినిమాతో ఈరోజు గ్రాండ్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లాంచ్ కాబోతున్నారు.  ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఎదురుచూస్తున్నారు 

Written by - Vishnupriya | Last Updated : Sep 6, 2024, 10:23 AM IST
HBD Nandamuri Mokshagna: బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ఆసక్తికర విషయాలు..

Nandamuri Mokshagna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ఒకవైపు సినిమాలలో హ్యాట్రిక్ విజయాలు అందుకుంటూ దూసుకుపోతూనే.. మరొకవైపు రాజకీయాలలో కూడా హ్యాట్రిక్ అందుకుంటున్నారు.  హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ దాదాపు మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ విజయకేతనం ఎగరవేశారు.

Add Zee News as a Preferred Source

ఆ ఇటీవలే సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ పెద్దలంతా గోల్డెన్ జూబ్లీ పేరిట చాలా గొప్పగా ఈయనను సత్కరించారు. ఈయన తరం ముగిసేలోపే ఈయన వారసుడు ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాదాపు గత మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ సిని ఎంట్రీ ఉంటుంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాలేదు. 

అయితే గతంలో మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు అనుకున్నప్పుడు చాలా బొద్దుగా వున్నాడు.. అసలు ఇతడు హీరో పీస్ ఏంటి ..అంటూ చాలామంది  విమర్శించారు కూడా. అసలు ఈయన పక్కన హీరోయిన్ గా ఎవరైనా నటిస్తారా అంటూ రకరకాల కామెంట్లు, హేళనలు కూడా చేశారు. కానీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న మోక్షజ్ఞ ఎలాగైనా సరే తనను తాను నిరూపించుకోవాలని ఎన్నో ఎక్సర్సైజులు చేసి ,డైట్ చేసి ప్రస్తుతం హీరో పీస్ అనిపించుకుంటున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు కొత్త సినిమాతో లాంచ్ కాబోతున్నారు మోక్షజ్ఞ.  ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఈరోజు జరగబోతున్నట్లు సమాచారం.

మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి రాకముందే వేలకోట్లకు ఆస్తిపరుడు అని చెప్పవచ్చు. తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసత్వంగా కొన్ని వందల కోట్లు సొంతం చేసుకున్న ఈయన,  తన తండ్రి వారసత్వంగా కూడా అంతకుమించి అందుకోబోతున్నారని చెప్పవచ్చు
  ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న రిచెస్ట్ వారసుడిగా పేరు సొంతం చేసుకుంటున్నారు మోక్షజ్ఞ. 

మోక్షజ్ఞ తన తండ్రిలాగే రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాలకృష్ణ రాజకీయాలకు స్వస్తి పలికే ముందు మోక్షజ్ఞ కి రాజకీయ పగ్గాలు అందించే అవకాశం కనిపిస్తోంది.

ఇకపోతే మోక్షజ్ఞ అక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సోదరి బ్రాహ్మణి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, ఇక రెండవ సోదరి తేజస్విని.. ఈమె భర్త భరత్ కూడా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. మొత్తానికైతే మోక్షజ్ఞ కి అటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది అని చెప్పవచ్చు.

Read more: Ola auto driver: రెచ్చిపోయిన ఓలా డ్రైవర్.. రైడ్ క్యాన్షిల్ చేసిందని యువతిని కొట్టి.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News