Jio Plans: జియో నుంచి కొత్త ప్లాన్..ఇక నుంచి 30 రోజుల కాల పరిమితి

Jio Plans: జియోలో సరికొత్త ప్లాన్ వచ్చింది. ఇక నుంచి జియో కస్టమర్లకు కాల పరిమితి పూర్తిగా 30 రోజులుంటుంది. 28 రోజుల కాలం చెల్లింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2022, 06:54 PM IST
 Jio Plans: జియో నుంచి కొత్త ప్లాన్..ఇక నుంచి 30 రోజుల కాల పరిమితి

Jio Plans: జియోలో సరికొత్త ప్లాన్ వచ్చింది. ఇక నుంచి జియో కస్టమర్లకు కాల పరిమితి పూర్తిగా 30 రోజులుంటుంది. 28 రోజుల కాలం చెల్లింది.

దేశంలోని వివిధ టెలికం కంపెనీలకు ఇటీవల ట్రాయ్ టెలికం సంస్థలకు పలు ఆదేశాలు జారీ అయ్యాయి. 28 రోజులు, 58 రోజులు ఉండకూడదని..పూర్తిగా నెలరోజులు అంటే 30 రోజులు కాల వ్యవధి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. నెలరోజుల కాలపరిమితితో పాటు రెగ్యులర్ ప్లాన్స్, స్పెషల్ టారిఫ్, కాంబో పథకాల్ని తప్పనిసరిగా వినియోగదారులకు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. 

దీని ప్రకారం ఇక నుంచి రీఛార్జ్ ఏతేదీన చేయిస్తే..తిరిగి వచ్చే నెల అదే తేదీన చేయించవచ్చు. ఇందులో భాగంగా జియో నుంచి 259 రూపాయల ప్లాన్ వచ్చింది. ఇది 30 రోజుల కాల వ్యవధికి వర్తిస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా అందుతుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. అంటే మార్చ్ 28న రీఛార్జ్ చేయిస్తే..తిరిగి వచ్చే నెల 28న రీఛార్జ్ చేయించుకోవచ్చు. 

Also read: Viral video: జిమ్​ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళ- అచ్చం అప్పు లానే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News