Snake Catcher Mirza MD Arif releasing World big King Cobra in Forest very cleverly: ఇంటర్నెట్‌లో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ వీడియోల్లో కొన్ని చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోస్ చూస్తే మాత్రం భయందోళనలకు గురవుతాం. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ సుమారు 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దాన్ని అడవిలో విడిచి పెడుతుండగా కాటేయడానికి మీదికే రాగా చాలా సులువుగా కంట్రోల్ చేశాడు.
స్నేక్ క్యాచర్ మీర్జా ఎండీ ఆరిఫ్ ఒడిశాలోని కంఠపాడ గ్రామంలో 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను పట్టుకుంటాడు. రాత్రి వేళ ఓ ఇంట్లోకి దూరిన పామును ఆరిఫ్ పట్టుకుని సంచిలో బంధిస్తాడు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆరిఫ్.. కింగ్ కోబ్రాను అటవీ ప్రాంతాల్లో వదలడానికి వస్తాడు. అడవిలో చాలా లోపలికి వెళ్లి సంచిలోంచి దాన్ని వదిలిపెడతాడు. నేలపై పడిన భారీ కింగ్ కోబ్రా.. ఒక్కసారిగా పాడగా విప్పి అతడిపైకి దూసుకొస్తోంది. అయినా కూడా స్నేక్ క్యాచర్ ఆరిఫ్ ఏమాత్రం వెనకడుగు వేయదు.
ఓసారి స్నేక్ క్యాచర్ ఆరిఫ్‌ను కాటేయడానికి బుసలు కొడుతూ దూసుకొచ్చింది. అయితే ఆరిఫ్ భయపడకుండా.. 'తగ్గేదేలే' అంటూ కింగ్ కోబ్రాను చాలా సులువుగా కంట్రోల్ చేసాడు. తన చేతులను అటుఇటు అంటూ కోబ్రాను కంట్రోల్ చేస్తాడు. చివరికి సురక్షితంగా పామును అడవిలో విడిచిపెడతాడు. ఈ వీడియోను ఆరిఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటిదాకా 1,622,567 వ్యూస్ వచ్చాయి. మరోవైపు నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియో పాతదైనప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: భారీ ధరకు పాత రూపాయి నోటు వేలం.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే! డిస్కౌంట్ ఆఫర్ కూడా
Also Read: సరికొత్త కథ అని చెప్పను కానీ.. మనందరి ఇంట్లో జరిగేదే ఈ సినిమా: కిరణ్ అబ్బవరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook