Snake Catcher Kiran Catches 12 feet King Cobra in Shivamogga: ఈ భూమ్మీద చాలా మందికి పాములు అంటే భయం. పామును చూస్తేనే అందరు పారిపోతారు. అలాంటిది కింగ్ కోబ్రా లాంటి ప్రమాదకర పాములను చూస్తే ఇంకేమైనా ఉందా?.. వెనక్కి తిరిగి చూడకుండా జంప్ అవుతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను ఓ ఆటాడుకున్నాడు. అంతేకాదు దాన్ని సులువుగా పట్టేశాడు. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కర్ణాటకలో పాములు పట్టడంలో స్నేక్ కిరణ్ చాలా ఫేమస్. ఎలాంటి పామును అయినా చాలా సులువుగా పట్టుకుంటాడు. తాజాగా కర్ణాటకలోని శివమొగ్గలో బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దాదాపుగా 12 అడుగులు ఉన్న కింగ్ కోబ్రా ఓ పాత ఇంట్లోకి దూరగా.. స్నేక్ కిరణ్ వచ్చి దాన్ని ముందుగా ఇంటి బయటికి తీసుకొచ్చాడు. అనంతరం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. కాటేయడానికి మీదికి దూసుకొచ్చింది. అయినా కూడా వెనక్కి తగ్గని కిరణ్.. చివరకు దాన్ని పట్టుకుని బంధించాడు.
12 అడుగులు ఉన్న కింగ్ కోబ్రాను స్నేక్ కిరణ్ పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని విజయ్ కర్ణాటక (Vijay Karnataka) అనే యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ వీడియో 5 నెలల కిందదే అయినా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 20 లక్ష్యలకు పైగా వ్యూస్ రాగా.. 10 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. పామును పట్టిన సదరు వ్యక్తి ధైర్యాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read: మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి!
Also Read: మెగా మాస్ మానియా.. రెండో రోజు ఊపందుకున్న గాడ్ ఫాదర్..మొదటి రోజు కంటే ఎక్కువగా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook