Snake Catchers extracted poison from Big King Kobra: పాము పేరు చెబితేనే అందరూ వణికిపోతారు. ఇక అది కనబడిందంటే అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు. ఎందుకంటే కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు, కింగ్ కోబ్రా లాంటి పాములు కాటేస్తే.. మనిషి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. అయితే స్నేక్ క్యాచర్‌లు పాములను పట్టి వాటి కోరల్లో ఉండే విషాన్ని తీసేస్తారు. దాంతో వారు మనుషుల ప్రాణాలను కాపాడుతారు. తాజాగా కింగ్ కోబ్రా కోరల్లోంచి విషం తీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పట్టుకుంటారు. దాని తల భాగాన్ని పట్టుకుని కోరలను గ్లాసులో ఉంచుతారు. తలపై ఒత్తి విషాన్ని గ్లాసులో పడతారు. 30 మందికి పైగా మనుషుల ప్రాణాలను కాపాడాము అని వారిద్దరూ మాట్లాడుకుంటారు. ఇందుకు సంబందించిన వీడియోను jayprehistoricpets అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్క పాముకు అంత విషం ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు.
మనుషుల ప్రాణాలు తీసే పాము విషం.. అదే మనుషుల ప్రాణాల్ని కాపాడానికి కూడా ఉపయోగపడుతుందట. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే ఇంజెక్షన్‌ను సైతం స్వల్ప శాతం విషంతో తయారు చేస్తారని తెలుస్తోంది. నాగు పాముల విషానికి భారీగా డిమాండ్ ఉందట. విదేశాల్లో అయితే లీటర్ నాగు పాము విషం ధర రూ. 40 లక్షలు పలుకుతుందట.
Also Read: కొండచిలువ కాటేసినా అస్సలు బెదరలేదు.. నీ ధైర్యానికి ఓ పెద్ద సలాం బాసూ!
Also Read: పంత్ పట్టించుకోకున్నా.. ఊర్వశి సీరియస్‌గా ప్రేమిస్తుందా! ఆస్ట్రేలియాలో హాట్ బ్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
King Kobra Venom: కింగ్ కోబ్రా కోరల్లోంచి విషం తీసిన వ్యక్తి.. బాబోయ్ ఇంత ఉంటుందా!
కింగ్ కోబ్రా కోరల్లోంచి విషం తీసిన వ్యక్తి
బాబోయ్ ఇంత ఉంటుందా
20 వేలకు పైగా లైక్‌లు