Viral Video: హ్యారీ పోటర్ థీమ్ సాంగ్ పాడిన హమ్మింగ్ బర్డ్‌..సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..!!

Humming Bird Singing: ప్రస్తుతం నెట్టింట లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం లిటిల్ హమ్మింగ్ బర్డ్‌కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 06:10 PM IST
  • హ్యారీ పోటర్ థీమ్ సాంగ్ పాడిన హమ్మింగ్ బర్డ్‌
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో
  • 20 మిలియన్లకు పైగా వ్యూస్‌
Viral Video: హ్యారీ పోటర్ థీమ్ సాంగ్ పాడిన హమ్మింగ్ బర్డ్‌..సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..!!

Humming Bird Singing: ప్రస్తుతం నెట్టింట లక్షలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం లిటిల్ హమ్మింగ్ బర్డ్‌కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పక్షి యజమాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.హ్యారీ పోటర్ అనే ఇంగ్లీష్‌ బ్లాక్ బస్టర్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.  అయితే ఈ సిరీస్‌కు సంబంధించిన థీమ్ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. 

ఈ వైరల్‌ అవుతున్న వీడియోలో హమ్మింగ్ బర్డ్ తన యజమాని భుజంపై కూర్చొని హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడింది. బర్డ్ పాట పాడిన దృశ్యాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ చిన్ని గొంతును నెటిజన్లు  ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌గా మారి 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ థీమ్‌ సాంగ్‌ను ఆ పక్షి ఆపకుండా కొన్ని సెకండ్ల పాటు పాడడంతో పక్షిని సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఈ పక్షి పడిన థీమ్‌ సాంగ్‌ వీడియోను యానిమల్స్ డూయింగ్ థింగ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్‌ చేశారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Animals Doing Things (@animalsdoingthings)

ఈ వీడియోను ఇప్పటివరకు 1,879,665 మంది  లైక్‌ చేశారు.హమ్మింగ్ బర్డ్ గొంతుకు ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజరన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు...ఒక వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేశారు "పక్షి అయినప్పటికీ పాటను ఆపకుండా పాడిందని కామెంట్‌ చేశారు. ఇంకొకరు స్పందిస్తూ..ఈ పక్షి పాటకు 10కి 15 మార్కులు వేశామని తెలిపారు.  

Also Read:  10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!

Also Read: Kinder Chocolate: కిండర్ జాయ్ చాక్లెట్‌ తిన్న 151 మంది చిన్నారులకు అస్వస్థత..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News