Preethi Reddy: మల్లారెడ్డి కోడలు లవ్‌స్టోరీ ఇదే.. సినిమాలో మాదిరి ట్విస్టుల మీద ట్విస్ట్‌

Mallareddy Kodalu Dr Preethi Reddy Love Story: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రేమకథ, మల్లారెడ్డి వ్యక్తిత్వం వంటివి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 24, 2024, 03:18 PM IST
Preethi Reddy: మల్లారెడ్డి కోడలు లవ్‌స్టోరీ ఇదే.. సినిమాలో మాదిరి ట్విస్టుల మీద ట్విస్ట్‌

Dr Preethi Reddy: తెలుగు రాష్ట్రాల్లో మల్లారెడ్డి పేరంటే తెలియని వారెవరూ ఉండరు. మల్లారెడ్డితోపాటు ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులు కూడా ట్రెండింగ్‌లో ఉన్నారు. కొన్నేళ్లుగా సోషల్‌ మీడియాలో మల్లారెడ్డి కోడలు పేరు కూడా మార్మోగుతోంది. కొడుకు ప్రేమ పెళ్లి విషయంపై ఒక బహిరంగ సభలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మల్లారెడ్డి విద్యాసంస్థలో జరుగుతున్న పరిణామాలపై మల్లారెడ్డి కోడలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి కోడలమ్మ ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇటీవల జీ తెలుగు  న్యూస్‌ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కోడలు ప్రీతిరెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'బిగ్‌ డిబేట్‌ విత్‌ భరత్‌' కార్యక్రమంలో ప్రీతిరెడ్డి మల్లారెడ్డి వ్యక్తిత్వం, ఆయన రాజకీయ జీవితం, విద్యా సంస్థలతోపాటు తన ప్రేమ కథ విషయం కూడా వివరించారు. తన ప్రేమ, పెళ్లి విషయంలో జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

Also Read: Delhi CM: అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌.. తదుపరి ఢిల్లీ సీఎం ఎవరు? రేసులో భార్యతో సహా ముగ్గురు

తెలుగింటి కోడలు అయిన ప్రీతిరెడ్డి స్వస్థలం కర్ణాటక. ప్రీతిరెడ్డి తల్లి ఒక వైద్యుడు కాగా తల్లి శాస్త్రవేత్త. వారికి ప్రీతిరెడ్డి ఒక్క కుమార్తెనే. 9వ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రీతిరెడ్డి తన తల్లిని కోల్పోయింది. తల్లి లేని పిల్ల అని చూడకుండా తండ్రి ప్రీతిరెడ్డిని అల్లారుముద్దుగా పెంచారు. తల్లి మరణించాక ప్రీతిరెడ్డి కుటుంబం మహారాష్ట్రలోని పుణెకు వెళ్లింది. అక్కడే ఎంబీబీఎస్‌, ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో చేశారు. అయితే కళాశాలలో చదువుతున్న సమయంలోనే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డితో పరిచయమైంది. భద్రారెడ్డి, ప్రీతి ఇద్దరూ చదువులో తొలి రెండు స్థానాల్లో నిలిచేవారు. అక్కడ జరిగిన పరిచయం వీరి మధ్య ప్రేమకు దారి తీసింది. చదువు అనంతరం పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. 2019లో మా వివాహం జరిగింది. ఆ సమయంలో వారి వయసు భద్రారెడ్డికి 29 ఏళ్లు, ప్రీతికి 27 ఏళ్లు. 

Also Read: KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..

 

మల్లారెడ్డి తండ్రిలాంటి వారు
మా ప్రేమకు మల్లారెడ్డి ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. కులాంతర వివాహనికి అంగీకరించి పుణెకు వచ్చి ప్రీతిరెడ్డి తండ్రితో మల్లారెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా మల్లారెడ్డి మా పెళ్లి చేశారు. పెళ్లయ్యాక పుణె నుంచి హైదరాబాద్‌ వచ్చాక నా కుటుంబాన్ని కోల్పోయాననే ఎలాంటి భావన లేకుండా మల్లారెడ్డి కుటుంబం చూపించింది. మల్లారెడ్డి నాకు తండ్రిలాంటివారు. అత్తమ్మ నాకు అమ్మనే. నాకు తల్లిలాంటి అత్తమ్మ దొరికింది. ఎందుకంటే నేను అతమ్మను 'అమ్మ' అనే పిలుస్తాను. నా రెండు కాన్పులను మా అత్తమ్మ దగ్గరుండి చూసుకుంది. గతంలో మల్లారెడ్డి 'నా కొడుకు రెడ్డి పిల్లను చేసుకుంటాడంటే ప్రేమ పెళ్లి చేసుకోని వచ్చాడు' అనే వ్యాఖ్యలపై స్పందించిన ప్రీతిరెడ్డి 'మల్లారెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం అది కాదు. ఆయన ఏనాడూ కులాన్ని పట్టించుకోరు. ఆ వ్యాఖ్యలు చేసిన అనంతరం మల్లారెడ్డి క్షమాపణలు కూడా కోరారు' అని గుర్తుచేశారు. ఇంట్లో మల్లారెడ్డికి తిరుగులేదు. ఆయన మాట అందరికీ వేదంలాంటిది. ప్రీతిరెడ్డికి మరాఠా, కన్నడ, తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలు వచ్చాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News