Viral Train Stunt Video: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలోనే ఫేమస్ అవ్వాలని ఆశిస్తున్నారు. ఈ ఆశే కొన్నిసార్లు ప్రాణాల మీదకు తీసుకోస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు, పోస్ట్‌లు చాలా త్వరగా లక్షల మందిని చేరుతున్నాయి. ఇది కొంతమందిలో తప్పుడు ఆశలు రేకెత్తిస్తోంది. అందుకే కొంతమంది వైరల్ కావడానికి వింత వింత పనులు చేస్తుంటారు. వీటినికి సంబంధించిన వీడియోలు ఎల్లప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం నట్టింట ఈ కోవకు చెందిన ఒక వీడియో హాట్ టాపిగ్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనం ఒకసారిగా షాక్,ఆందోళనకు గురయ్యారు.
ఈ వీడియోను @ActualidaViral అనే ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఓ యువకుడు వేగంగా వెళ్తున్న ట్రైన్ పైన ఎక్కి చిందులు వేయసాగాడు. యువకుడిని మరో ట్రైన్ పైన యువకుడిని ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ట్రైన్ పైన ఉన్న యువకుడు కిటికలను పట్టుకొని కోతిగా చిందులు వేస్తున్న సమయంలో ఊహించిన సంఘటన చోటు చేసుకుంటుంది. యువకుడు ట్రైన్ కిటికి సహాయంతో పైనకు ఎక్కిసెల్ఫీ తీసుకుంటుడగా ఎలక్ట్రిక్ కేబుల్ తగ్గిలి యువడు తీవ్రంగా గాయపడుతాడు. పెద్ద శబద్దం రావడంలో ట్రైన్ యాజమాన్యం యువకుడిని రక్షించి ఆస్పుత్రికి తరిలించారు. యువకుడి తీవ్రంగా కాలిపోవడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. మరికొందరూ యువకుడినికి తగిన శాస్తి అయిందని కామెంట్స్ చేయసాగారు.
🇮🇳 En la India, un joven desafía su suerte practicando un tipo de surf en un tren, y ocurre algo "inesperado". pic.twitter.com/wWbPgvUDmm
— Actualidad Viral (@ActualidaViral) January 22, 2024
సోషల్ మీడియా ఒక వైపు మనల్ని అందరితో కనెక్ట్ చేసి, సమాచారాన్ని త్వరగా పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు దీనిని కొంతమంది తప్పుడు దారిలో వాడుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేయవచ్చు. కొన్నిసార్లు దాని నిజ నిర్ధారణ లేకుండా అది వైరల్‌గా మారి, అల్లర్లు, అశాంతికి కారణం కావచ్చు. కొంతమంది ఇతరులను సోషల్ మీడియాలో అవమానించడం, బెదిరించడం చేస్తున్నారు. సోషల్ మీడియాను సక్రమంగా వాడితే మనం చాలా మంచి పనులు చేయవచ్చు.
కానీ దీనిని తప్పుగా వాడితే అది సమాజానికి హాని కలిగిస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాను మితంగా వాడాలి. వ్యక్తిగత సమాచారాన్ని అందరితో పంచుకోకూడదు. ఏదైనా సమాచారాన్ని పంచుకోవడానికి ముందు దాని నిజ నిర్ధారణ తెలుసుకోవాలి. ఏ సమాచారాన్ని పంచుకోవాలో, ఎవరిని ఫాలో అవ్వాలి అనే విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే సోషల్ మీడియా ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి ముందుగా తెలుసుకోవాలి. కొంతమంది ఫేమస్ కావడానికి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించే ముందు ఒకసారి ఆలోచించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.