ట్విట్టర్ ఫాలోవర్స్ లో దూసుకెళ్తున్న కోహ్లీ

ప్రధాని మోదీ కన్నా కోహ్లీనే ట్విట్టర్ లో టాప్ లో ఉన్నారు. ప్రధాని మోదీ ని అనుసరించే వారికన్నా 2017వ సంవత్సరంలో కోహ్లీని అనుసరించే ఫాలోవర్స్ సంఖ్య అధికంగా ఉందట. ఈ విషయాన్ని ఒక వెబ్సైటు గణాంకాలతో సహా వెల్లడించింది.

Last Updated : Dec 6, 2017, 12:07 PM IST
ట్విట్టర్ ఫాలోవర్స్ లో దూసుకెళ్తున్న కోహ్లీ

కోహ్లీ 61.. మోదీ 52.. ఇదేదో వయసు లెక్కలు.. పరుగుల లెక్కలు అనుకుంటే పొరబడినట్టే..! ట్విట్టర్ అండి బాబోయ్.

అవును.. ప్రధాని మోదీ కన్నా కోహ్లీనే ట్విట్టర్ లో టాప్ లో ఉన్నారు. ప్రధాని మోదీ ని అనుసరించే వారికన్నా 2017వ సంవత్సరంలో కోహ్లీని అనుసరించే ఫాలోవర్స్ సంఖ్య అధికంగా ఉందట. ఈ విషయాన్ని ఒక వెబ్సైటు గణాంకాలతో సహా వెల్లడించింది.

* ప్రధాని మోదీని 2016లో ఫాలోవర్స్ 2.41 కోట్లు ఉండగా.. 2017 డిసెంబర్ నాటికి 52 శాతం పెరిగి 3.75 కోట్లకు చేరుకుంది. కోహ్లీని 2016లో అనుసరించే ఫాలోవర్స్ సంఖ్య 2016లో 1.29 కోట్లు ఉండగా.. ఈ ఏడాది 61 శాతం పెరిగి 2.08 కోట్లకు చేరుకుందని తెలిపింది.

* కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను అనుసరించేవారి సంఖ్య 56 శాతం పెరిగిందని సదరు వెబ్సైటు తెలిపింది. కోహ్లి, టెండూల్కర్ లు అగ్రస్థానంలో నిలిచి టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.

* ఈ జాబితాలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, దీపికా పడుకొనే మరియు హృతిక్ రోషన్ లు ఉన్నారు.

* షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కు ట్విట్టర్ ఫాలోవర్స్ 40 శాతం పెరిగారు. షారుఖ్ ఖాన్ కు 30.9 మిలియన్ ఫాలోవర్స్, సల్మాన్ ఖాన్ కు 28.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

* భారతదేశం-పాకిస్థాన్ మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్స్ పై 1.8 మిలియన్ ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. తరువాతి స్థానంలో భారతదేశ అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ ఉంది.

* వివాదాస్పద 'ట్రిపుల్ తలాక్' సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆగస్టు 22 న ట్విట్టర్లో '#ట్రిపుల్తలాక్' అనే హ్యాష్ టాగ్ తో  350,000 పైగా ట్వీట్లు పోస్ట్ అయ్యాయి.

Trending News