Rare Nagamani Video Watch Here Now: పురాణాల్లో నాగమణి గురించి ఎంతో క్లుప్తంగా వివరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న యువతకు నాగమణి గురించి అంతగా తెలియదు. నాగమణి అంటే ఏంటో కాదు.. నాగుపాము పై తల భాగంలో ఉండే ఒక రత్నమే.. నాగమణిగా పిలుస్తారు. మన పూర్వీకులు నాగమణికి సంబంధించిన అనేక కథలు చెప్పుకుంటూ వచ్చారు.. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నాగమణి రత్నం గురించి మనం చూసాం. అయితే పాము తలకు నిజంగానే రత్నం ఉంటుందా? ఇది నిజమేనా అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. పూర్వీకుల్లో చాలామంది నాగమణి ఉంది అని నమ్మితే.. కానీ ఇప్పటి యువత కొంతమంది మాత్రం లేదని నమ్ముతూ ఉంటారు. నిజానికి ఉన్నట్టా లేనట్లా అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
ఇటీవల నాగమణికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ వీడియోలో ఒక వ్యక్తి ఏకంగా కింగ్ కోబ్రా తల నుంచి చిన్న నాగమణి రత్నాన్ని బయటకు తీసి చూపించాడు. అయితే ఇది నిజంగా నాగమణినా అని చాలామంది సందేహ పడుతున్నారు. అయితే ఇది నిజమో కాదో అయినప్పటికీ సోషల్ మీడియాలో వీడియో మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది. వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ పల్లెటూరులోని రెండు ఎండిన పొలాల మధ్య ఒక ఘాట్ రోడ్ పై భారీ కింగ్ కోబ్రా ఉంటుంది. ఓ 60 సంవత్సరాల పెద్దాయన దాన్ని పట్టుకునేందుకు చాలానే ప్రయత్నిస్తాడు. ఆ పాము ఇంతలోనే అతని నుంచి తప్పించుకొని పొలాల్లోకి వెళ్లేందుకు కూర ప్రయత్నిస్తుంది. అయితే దీనిని ముందుగానే గమనించిన పెద్దాయన పాము తోకతో మళ్లీ నడిరోడ్లోకి లాగుతాడు. అయితే ఈ సమయంలో అతని కాటేసేందుకు పలుమార్లు పాము ప్రయత్నిస్తుంది. అతనికున్న తెలివితో చాకచక్యంగా పాము కాటు నుంచి తప్పించుకో గలుగుతాడు.
ఏది ఏమైనా ఆ పెద్దాయన పాము తలభాగాన్ని పట్టుకొని నడిరోడ్డుపై పరుస్తాడు. ఇలా పరిచిన పాము తల పట్టుకొని అతని వద్ద ఉన్న ఎంతో షార్ప్ అయినా షాకుతో తలపై భాగాన్ని కోసేస్తాడు. ఇంతలోనే అతనికి తల భాగంలో చిన్న సైజు రత్నం లాంటిది లభిస్తుంది. దానిని తీసుకొని అతడు ఆ పాముని పక్కనే ఉన్న పొలాల్లోకి వదిలేస్తాడు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. ఈ వీడియో గతంలోదే అయినప్పటికీ.. నెటిజన్స్ కి పాములు పై ఉన్న ఆసక్తి పెరగడంతో మళ్లీ టెండింగ్ లోకి వచ్చింది. గతంలోనే ఈ వీడియోను 11 లక్షలకు పైగా నెటిజన్స్ వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది అయితే ఆ పెద్దాయన తీసిన రత్నం పై కామెంట్లు కూడా చేస్తున్నారు..
నాగమణి రత్నం గురించి బృహత్‌సంహిత అనే గ్రంథంలో కూడా క్లుప్తంగా పేర్కొన్నారు. ఆ గ్రంథంలో నాగమణి రత్నానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తూ.. దాని గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. నాగమణి రత్నం కొన్ని పాములకు మాత్రమే ఉంటుందట. అంతేకాకుండా చాలా అరుదుగా ఈ రత్నం లభిస్తుందని ఆ గ్రంథంలో వెల్లడించారు. అలాగే ఈ నాగమణి రత్నం నుంచి వెలువడే ఒక శక్తివంతమైన కాంతి రాత్రిపూట కూడా అగ్నిలా వెలుగుతుందని తెలుస్తోంది. ఇది ఉన్న పామును సులభంగా గుర్తుపట్టేలా పూర్వికులకు కొన్ని ప్రత్యేకమైన ట్రిక్స్ తెలిసేవట. అంతేకాకుండా ఈ రత్నం కలిగిన పాము ఎక్కడ ఉన్న గుర్తుపట్టేలా ఒక ప్రకాశవంతమైన కాంతిని కలిగి ఉండేదట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.