New Year Turns Tragedy: కొత్త సంవత్సర వేడుకలు తెలంగాణలో తీవ్ర విషాదంగా మారింది. అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పాడని కుటుంబసభ్యులు దాడి చేయడంతో యువకుడు మనస్తాపం చెందాడు. ఆ బాధతో ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబసభ్యులు.. బంధువులు ఆందోళన చేపట్టారు. బాలిక కుటుంబసభ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Sankranti: సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ పోలీసుల భారీ షాక్.. కోడి పందాలకు బ్రేక్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన శివ కిశోర్ పదో తరగతి చదువుతున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా గ్రామంలో సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా తమ గ్రామానికి చెందిన తన క్లాస్‌మెట్ విద్యార్థినిని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. అయితే బాలికకు శుభాకాంక్షలు చెబుతున్న క్రమంలో దీనిని అమ్మాయి కుటుంబసభ్యులు చూశారు. తమ అమ్మాయితో మాట్లాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా అమ్మాయికి విషెస్ చెప్తావా' అని ఆగ్రహంతో శివకిశోర్‌పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
Also Read: Game Changer Trailer: 'గేమ్‌ఛేంజర్'లో రామ్ చరణ్ అన్నదమ్ముళ్లా.. తండ్రీకొడుకులా?
వెంటనే కుటుంబీకులు బంధువులతో కలిసి శివ కిశోర్‌పై దాడికి దిగారు. బాలిక తరఫు వారు దాడి చేయడంతో శివ కిశోర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే అవమాన భారంతో ఇంటికి వెళ్లి తలుపులు వేసుకొని రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జరిగిన విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు బాలిక తరఫు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం శివకిశోర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన గ్రామంలో సంచలనంగా మారింది. విషెస్ చెప్పడంతోనే ఇంతటి దారుణ సంఘటన చోటుచేసుకోవడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook