Patna CCTV Video: పట్టపగలే..నడిరోడ్డుమీద..భార్యను చంపేశాడు. కూతుర్ని చంపాడు. తనను తానూ చంపుకున్నాడు. ఇదేదో సినిమా సీన్ కాదు. నిజంగా జరిగిందే. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాట్నాలో జరిగిన ఈ ఘోర ఉదంతం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ దారుణ దృశ్యం పట్టపగలు, ఉదయం సమయంలో..నడిరోడ్డుపై జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను, కూతురిని ట్రిగ్గర్ పాయింట్లో పెట్టి కాల్చి..తనూ కాల్చుకుంటాడు. అక్కడే ఉన్న మరో మహిళ నిశ్చేష్టురాలై చూస్తూ షాక్‌కు గురవుతుంది.
ఒళ్లు గగుర్పొడిచే, మనసు చలింపజేసే ఈ వీడియోలో ముగ్గురు మహిళలుంటారు. మరో వ్యక్తి రాజీవ్. రాజీవ్ అనే వ్యక్తి ఈ ముగ్గురిని అడ్డగించి..ముందుగా తన భార్యను, కూతురిని టిగ్గర్ పాయింట్లో గన్ పెట్టి కాలుస్తాడు. ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. మరో మహిళ ఇది చూసి భయపడి షాక్‌కు గురయ్యేలోగా..ఆ వ్యక్తి తనను తాను కాల్చుకుని కుప్పకూలిపోతాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డైంది. సంచలనంగా మారింది.
Caught on Camera: Man kills wife, daughter in #Patna (Trigger warning: Visuals are disturbing)#Crime #Patna #Bihar pic.twitter.com/OOnDUAz0I0
— India.com (@indiacom) April 28, 2022
ఈ ఘటన పాట్నాలోని గర్దనీబాఘ్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. నిందితుడి పేరు రాజీవ్. భార్య చనిపోతే..అతని మరదలిని పెళ్లి చేసుకుంటాడు రాజీవ్. అయితే ఆ ఇద్దరి పెళ్లి సజావుగా సాగకపోవడంతో ఇద్దరూ విడిపోతారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాల్ని స్వాధీనం చేసుకుంటారు. ప్రాధ్యమికంగా దర్యాప్తు ఆధారంగా కుటుంబ కలహాల నేపధ్యంలో ఆ వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.