Petrol Tank Blast Fact Check: సోషల్ మీడియాలో వార్తల అప్డేట్స్ అత్యంతవేగంగా వస్తుంటాయి. చాలాసార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాకంటే ముందే సోషల్ మీడియాలో అప్డేట్స్ వస్తుంటాయి. అయితే అందులో నిజాలతో పాటు చాలాసార్లు తప్పుడు వార్తలు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు చాలా వార్తలు ట్రెండ్ కూడా అవుతుంటాయి. అయితే అందులో నిజమెంత అనేది తెలుసుకోకుండా చాలా మంది వాటని నమ్ముతుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త ట్రెండవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో తెగ ఫార్వర్డ్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్తలో ఏముంది?
తాజాగా ఓ వార్త చమురు మార్కెటింగ్ సంస్థ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేరుపై ట్రెండవుతోంది. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఇంకా ఆరంభ దశలోనే రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులను ఐఓసీ హెచ్చరిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోది.
'ఎండలు మండపోతున్నందున వాహనాల్లో పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించకండి. దీనివల్ల పేలుళ్లు సంభవించే ప్రమాదముంది. ఇప్పటికే ఈ వారంలో 5 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోజులో కనీసం ఒకసారైనా పెట్రోల్ ట్యాంక్ తెరవడం ద్వారా లోపల ఉండే గ్యాస్ బయటకు వస్తుంది. ఈ విషయాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపండి' అనేది ఆ ఫార్వర్డ్ సమాచారంలోని సమాచారం.
ఈ వార్తలో నిజమెంత?
తమ సంస్థ పేరుమీద ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో ఐఓసీ క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఇదే విషయమై 2019లోనే క్లారిటీ ఇచ్చింది సంస్థ. తాజాగా మరోసారి ఇదే వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తమైంది. తాము ఇలాంటి హెచ్చరికను జారీ చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నకిలీదని తేల్చి చెప్పింది. తాము ఎప్పుడు అలాంటి ప్రకటన చేయలేదని వివరించింది.
ఆటోమొబైల్ కంపెనీలు.. వాహనాన్ని తయారు చేసేటప్పుడు అన్ని పరిస్థితులను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటాయని.. అందువల్ల ఎండాకాలంలో ట్యాంక్ ఫుల్ చేయిస్తే పెలుళ్లు సంభవిస్తాయనేది తప్పుడు వాదన అని కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను నమ్మొద్దని సూచించింది.
Important announcement from #IndianOil. It is perfectly safe to fill fuel in vehicles up to the limit(max) as specified by the manufacturer irrespective of winter or summer. pic.twitter.com/uwQFDtjTdi
— Indian Oil Corp Ltd (@IndianOilcl) June 3, 2019
Also read: Pushpa in Exam: ఆన్సర్ షీట్లో 'పుష్ప పుష్ప రాజ్' డైలాగ్.. వైరల్ అవుతోన్న ఫొటో
Also read: Optical Illusion Photo: ఈ చిత్రంలో రెండు వేర్వేరు జీవులు ఉన్నాయి- అవేంటో మీరు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook