Anchor Ravi Wife : 18 ఏళ్ల పరిచయం.. పదేళ్ల వివాహా బంధం.. యాంకర్ రవి ఎమోషనల్ పోస్ట్

Anchor Ravi Wife యాంకర్ రవి తాజాగా తన భార్య గురించి చెబుతూ ఓ పోస్ట్ వేశాడు. పదేళ్ల వివాహా బంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. రాత్రి పూట తన కూతురు వియా ఇలా సర్ ప్రైజ్ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 10:45 AM IST
  • నెట్టింట్లో యాంకర్ రవి సందడి
  • భార్యపై ప్రేమను కురిపించిన రవి
  • పదేళ్ల వివాహా బంధంపై రవి పోస్ట్
Anchor Ravi Wife : 18 ఏళ్ల పరిచయం.. పదేళ్ల వివాహా బంధం.. యాంకర్ రవి ఎమోషనల్ పోస్ట్

Anchor Ravi Wife యాంకర్ రవి, నిత్యా సక్సేనా పోస్టులు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక యాంకర్ రవి కూతురు వియాకు అయితే నెట్టింట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బిగ్ బాస్ ఇంట్లో రవి తన కూతురు వియాతో ఎంత అల్లరి చేశాడు.. ఆ ఎమోషనల్ ఎపిసోడ్‌తో యాంకర్ రవికి పూర్తిగా పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. అంతకు ముందు వచ్చిన నెగిటివ్ అంతా కూడా పోయింది.

బిగ్ బాస్ ఇంట్లో రవి తన మాటలు మార్చే తీరు, చెప్పిన మాటలను వేరేలా మార్చడం, అమ్మ తోడు అంటూ అబద్దాలు ఆడటం అందరికీ తెలిసిందే. లహరి, ప్రియ విషయాల్లో రవి చేసిన తప్పులకే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అలా రవి చివరి వరకు ఉండి విన్నర్ కావాల్సిన వాడు మధ్యలోనే రావాల్సి వచ్చింది. బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చిన రవికి తన కెరీర్‌లో ఎలాంటి మార్పులు అయితే తెచ్చుకోలేకోపోయాడు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

బిగ్ బాస్ షోతో రవికి నెగెటివ్ అయింది. అయితే పాజిటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. అన్నింటి కంటే ఎక్కువగా నటరాజ్ మాస్టర్ పెట్టిన గుంటనక్క పేరు మాత్రం ఎక్కువగా ఫేమస్ అయింది. కానీ రవికి తన భార్య ఇచ్చిన సలహాలు, ఆ ఫ్యామిలీ ఎపిసోడ్ మాత్రం హైలెట్ అయింది. ఏమైనా అని.. గుర్తు లేదంటే.. గుర్తుకు లేదని చెప్పేసేయ్.. సాగదీయకు.. అబద్దం ఆడకు అన్నట్టుగా రవికి నిత్య సలహా ఇచ్చింది. కానీ అదే వారం రవి ఎలిమినేట్ అయిపోయాడు.

రవి, నిత్యల కాలేజ్ లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. కాలేజ్‌లో ఫ్రెండ్ లవర్ అయిన నిత్యాను పడేశాడు రవి. పద్దెనిమిదేళ్ల పరిచయం, పదేళ్ల వివాహా బంధం.. రోజురోజుకూ మా బంధం మరింత బలంగా మారుతూనే ఉంది.. దశాబ్దంగా మా ఈ సంతోషం ఇలానే సాగుతోంది.. ఇంకా ఇలాంటి పెళ్లి రోజులెన్నో జరుపుకోవాలంటూ రవి ఎమోషనల్ పోస్ట్ వేశాడు. అయితే వియా తన తల్లిదండ్రులకు ఇచ్చిన సర్ ప్రైజ్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్పెషల్‌గా వియా ఇలా మాట్లాడి డెకరేట్ చేయించిందట. తన కూతురు ఇచ్చిన సర్ ప్రైజ్‌కు రవి, నిత్యాలు ఫిదా అయ్యారు.

Also Read : Shruti Haasan without Makeup : మేకప్ లేకపోతో ఇలా ఉంటుందా?.. శ్రుతి హాసన్‌ అలా అయిపోవడానికి కారణాలివేనట

Also Read : Dil Raju Varisu : 75 ఏళ్ల చరిత్రలో ఇలా జరగలేదు.. 'వారసుడు' వివాదంపై దిల్ రాజు కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News