Python Attacks on Men Video got Viral: అన్ని పాములు విషపూరితమైనవిగా భావిస్తారు. కానీ ప్రపంచంలో అన్ని పాములు విషపూరితమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జీవిస్తున్న పాములలో కొన్ని విషపూరితమైనవి అయితే మరికొన్ని వాటికంటే ప్రమాదకరమైన వని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విషపూరితమైన పాముల కంటే ప్రమాదకరమైన పాములే ప్రాణాంతకం.
ప్రమాదకరమైన పాములు కొండచిలువ ఒకటి. ఈ పాము ఎలాంటి విషయాన్ని చెమదు కానీ ఒక్కసారి అది మిమ్మల్ని చుట్టుకుంటే ఒక్కటేముక్కలను సైతం కూడా నుజ్జు నుజ్జు చేయగలిగే సామర్థ్యం ఆ పాముకుంటుంది. ఇటీవల కొండచిలువకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో.. ఆ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఈ వీడియోను క్లియర్ గా గమనిస్తే.. వేట కోసం వెళ్ళిన ఓ వృద్ధుడి మెడకు కొండచిలువ బలంగా చుట్టుకుని ఉంటుంది. ఆ వృద్ధుడు సహాయం కోసం ఆర్తనాదాలు పెడతాడు. దీంతో ఇద్దరు పిల్లలు ఆ వృద్ధుడి మెడకున్నా భారీ కొండచిలువను విడిపించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తారు.
ఒక పిల్లాడు ఏకంగా సాహసం చేసి వృద్ధుడి మెడకున్నా పాముని కొంతవరకు తీసేందుకు ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ ఆ పాము మెడ నుంచి రాకపోవడంతో మరో పిల్లాడు అక్కడే ఉన్న బండరాయిని తీసి కొండచిలువను చంపేందుకు పైకెత్తుతాడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కొండచిలువ మెడ వదల్లేక పోయింది.
Kalesh b/w Python snake and an Old man pic.twitter.com/uQ1BqE9dip
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 27, 2023
Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
కొండచిలో పాములు చాలా ప్రమాదకరమైనవి ఇతర పాముల కంటే ఇవి 100 రేట్లు ప్రమాదకరమైన వని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక్కసారి ఏదైనా జంతువు కానీ చుట్టుకుంటే వాటిని చంపే దాకా అలాగే ఉంటుంది. కాబట్టి వీటితో సాహసం చేయడం మానుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ గూస్‌బంప్స్ వీడియోను నేటిజెన్లు చూసి తెగ భయాందోళనకు చెందుతున్నారు. మరికొందరైతే వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోను @gharkekalesh అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ 44 సెకండ్లు గల వీడియోను ఇప్పటికీ 90 వేలకు పైగా మంది వీక్షించగా.. వందలాదిమంది ఈ వీడియోను లైక్ షేర్ చేస్తున్నారు.
Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook