Viral Video: మొసలిని మింగిన కొండచిలువ.. ఎలా బయటకు తీశారో చూడండి.. గూస్‌బంప్స్ పక్కా..!

Python Swallows Alligator: ఐదు అడుగుల మొసలిని 18 అడుగుల కొండచిలువ మింగేసింది. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గూస్‌బంప్స్‌ పక్కా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 04:41 PM IST
Viral Video: మొసలిని మింగిన కొండచిలువ.. ఎలా బయటకు తీశారో చూడండి.. గూస్‌బంప్స్ పక్కా..!

Python Swallows Alligator: మనుషులను, మేకలను, ఇతర జంతువులను కొండచిలువలు మింగడం చూసుంటారు. కానీ ఆశ్చర్యకరమంగా మొసలిని మింగింది. ఓ కొండ చిలువ మొసలిని మింగగా.. దాని కడుపు చీల్చి కొండ చిలువను బయటకు తీశారు. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 18 అడుగుల పొడవున్న కొండచిలువ.. 5 అడుగుల మొసలిని మింగినట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.
 
ఈ వీడియో చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోసీ మూర్ అనే నెటిజన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీడియోలో చాలా భిన్నమైన ఫొటోలు కూడా కనిపిస్తాయి. ఒక భాగంలో కొండచిలువ శరీరం వాచిపోయి కనిపిస్తోంది. నిపుణులు కొండచిలువ శరీరాన్ని ఒక వైపు నుంచి నెట్టారు. ఆ తరువాత చిత్రంలో కొండ చిలువ కడుపు నలిగిపోతుంది. చివరగా 5 అడుగుల మొసలిని బయటకు తీశారు. ఇది బర్మీస్ పైథాన్. దీని పొడవు 18 అడుగులు ఉంటుంది. బర్మీస్ పైథాన్ ప్రపంచంలోని అతిపెద్ద కొండచిలువలలో ఒకటి. ఇది 20 అడుగుల పొడవు వరకు ఉంటుంది. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rosie Moore (@rosiekmoore)

 

దక్షిణ ఫ్లోరిడాలోని ఉపఉష్ణమండల వాతావరణంలో బర్మీస్ పైథాన్‌లు దీర్ఘకాలం జీవిస్తాయి. జాతీయ ఉద్యానవనాలు వంటి సున్నితమైన ప్రదేశాల్లోకి కూడా ప్రవేశించి వన్యప్రాణులకు ముప్పు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొండచిలువ దేన్నైనా తినగలదని ఈ ఘటనతో స్పష్టమైందంటున్నారు. 

 

కొండచిలువ నోటిలో సూది కొనలా పదునుగా ఉంటే పళ్లు ఉంటాయి. పళ్లను ఉపయోగించి లోపలకు లాక్కుని నెమ్మదిగా మింగుతుంది. మనుషులు, ఇతర జంతువులను కొండ చిలువను మింగడం విన్నాం కానీ.. మొసలిని మింగడం చూడడం ఫస్ట్ టైమ్ అని నెటిజన్లు అంటున్నారు. ఇటీవలె ఇండోనేషియాలో 22 అడుగుల కొండచిలువ ఓ మహిళను మింగేసింది. అప్పుడు కూడా కొండచిలువ కడుపు చీల్చి మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. కొండచిలువ కడుపులోంచి ఎవరైనా సజీవంగా బయటకు రావడం ఒక అద్భుతమే అవుతుంది.  

Also Read: Note Printing Cost: కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా..!   

Also Read: Aamir khan big break : సినిమాలకు ఆమీర్ ఖాన్ బిగ్ బ్రేక్.. ఎందుకో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News