Watch Now: రంగు మారిన మొసలి పిల్ల.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Rare White Alligator Viral Video: ప్రస్తుతం ఓ అరుదైన జాతి మొసలి పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇంతవరకు ఇలాంటి ముసలి పిల్లను చూడలేదని కామెంట్ చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 12:55 PM IST
Watch Now: రంగు మారిన మొసలి పిల్ల.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

 

Rare White Alligator Viral Video: సోషల్ మీడియాలో తరచుగా జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే చాలామంది నెటిజన్స్ ఈ వీడియోలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. వింత జంతువులకు సంబంధించిన ప్రతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఓ అరుదైన ముసలి పిల్లలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నితిజన్స్ ఇలాంటి అరుదైన ముసలిని చూడడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో ఉండే ఓర్లాండ్ లో వైల్డ్ లైఫ్ క్రొకోడైల్ పార్కులో బ్లూ కలర్‌లో ఉండే మోసలికి, తెలుపు రంగులో ఓ చిన్న ముసలి పిల్ల పుట్టింది. అయితే అక్కడున్న అధికారులు ముందుగా గమనించి.. ఇలాంటి అరుదైన ముసలి పిల్లను చూడడం మొదటి సారి అని సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేశారు. అయితే ఓర్లాండ్‌లో ఉన్న పార్కులో అల్బినో అనే మొసలి తరచుగా తన చర్మం రంగులు మార్చుతుందని పార్క్ లో ఉండే అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఈ తల్లి ముసలి తెలుపు రంగులోకి కూడా మారుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ముసల్లు కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయని అందులో ఈ వైల్డ్ లైఫ్ పార్కులో రెండు ఉన్నాయని తెలిపారు. 

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

ఇటీవలే తెలుపు రంగులో జన్మించిన ముసలి పిల్ల నలభై సెంటీమీటర్ల పొడవు ఉందని పార్క్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ పార్కు సంబంధించిన సీఈవో మార్క్ మెక్ హాగ్ ఈ అరుదైన మొసలి పిల్ల గురించి మాట్లాడుతూ.. "ఇది చాలా అరుదైన మొసలి పిల్ల ప్రపంచవ్యాప్తంగా కేవలం 8 నుంచి 9 వరకు మాత్రమే ఇలాంటి మొసళ్లు ఉన్నాయి. ఈ జాతికి చెందిన మొసళ్లు అప్పుడప్పుడు రంగును కూడా మార్చుకోగలుగుతాయి" అని అన్నారు. దీనిపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ..చర్మం రంగుకు కారణమైన మెలానిన్ అనే రసాయనంలో తేడాలు రావడం వల్ల జంతు చర్మంపై మార్పులు వస్తాయని తెలిపారు.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News