Sending Heart Emoji to Ladies: లేడీస్‌కి హార్ట్ ఇమోజీస్ పంపిస్తే జైలులో చిప్ప కూడే

Sending Heart Emojis to Ladies: వాట్సాప్‌లో లేడీస్‌కి హార్ట్ ఇమోజీస్ పంపిస్తున్నారా ? ఒకవేళ మీ జవాబు ఔను అయితే, ఇకపై మానుకోండి. లేదంటే మీరు రూ. 5 లక్షల నుండి 66 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదండోయ్.. 2 ఏళ్ల నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

Written by - Pavan | Last Updated : Aug 8, 2023, 09:19 AM IST
Sending Heart Emoji to Ladies: లేడీస్‌కి హార్ట్ ఇమోజీస్ పంపిస్తే జైలులో చిప్ప కూడే

Sending Heart Emojis to Ladies: వాట్సాప్‌లో లేడీస్‌కి హార్ట్ ఇమోజీస్ పంపిస్తున్నారా ? ఒకవేళ మీ జవాబు ఔను అయితే, ఇకపై మానుకోండి. లేదంటే మీరు రూ. 5 లక్షల నుండి 66 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదండోయ్.. 2 ఏళ్ల నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ స్ట్రిక్ట్ రూల్ పెట్టింది మన దేశంలో కాదులెండి. గల్ఫ్ న్యూస్ వెల్లడించిన కథనం ప్రకారం.. సౌది అరేబియా, కువైట్ లలో అక్కడి ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.   

కువైటీ అటార్నీ హయ అల్ శలాహీ మాట్లాడుతూ, కువైట్‌లో లేడీస్‌కి వాట్సాప్‌లో ఇమోజీ పంపించడాన్ని నేరంగా పరిగణిస్తూ 2000 కువైట్ దీనార్స్ జరిమానా విధించడంతో పాటు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష సైతం విధించనున్నట్టు తెలిపారు. 

అలాగే, సౌది అరేబియాలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా లేడీస్‌కి వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఇమోజీలు పంపిస్తే మీరు జైలు పాలయ్యే ప్రమాదం ఉంది. సౌది అరేబియాలో ఇది మరీ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అందుకే ఇలాంటి నేరంలో దోషిగా తేలిన వారికి రెండేళ్ల నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు 100,000 సౌది రియాల్స్ జరిమానా విధిస్తారు. అంటే మన భారతీయ కరెన్సీలో 22 లక్షలు అన్నమాట. 

ఇది కూడా చదవండి : Farmer Buys SUV Car: టమాటాలు అమ్మి SUV కారు కొన్న యువ రైతు

సౌది అరేబియా న్యాయ శాస్త్రం ప్రకారం అమ్మాయిలకు, మహిళలకు రెడ్ హార్ట్ పంపించడం అనేది వేధింపుల కిందకే వస్తుంది అని సౌది అరేబియాకు చెందిన సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్ తెలిపారు. సౌది యాంటీ - ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యులు అల్ మోతాజ్ కుత్బి చెప్పిన వివరాల ప్రకారం ఆన్‌లైన్ సంభాషణల మధ్యలో రెడ్ హార్ట్ సింబల్ పంపించడం అనేది చట్టరీత్యా వేధింపుల కిందకే వస్తుందని.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నారు. ఒకవేళ ఇదే నేరం మరోసారి రిపీట్ అయితే.. నేరం తీవ్రత పెరుగుతుంది. అలా రెండోసారి నేరానికి పాల్పడిన వారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 3 లక్షల సౌది రియాల్స్ చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ కరెన్సీలో ఈ జరిమానా మొత్తం విలువ రూ. 66 లక్షల పైమాటే. ఒక విధంగా కువైట్, సౌది అరేబియాలో వాట్సాప్ యూజర్స్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే అన్నమాట.

ఇది కూడా చదవండి : How Hackers Hacking Mobiles Simply: మీకే తెలియకుండా మీ ఫోన్ హ్యాకింగ్‌కి ఇస్తున్నారు.. ఇదొక కొత్త మోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News