Viral Video:120కి.మీ స్పీడులో వెళ్తున్న కారు అద్దంపై పాము... ఆశ్చర్యపోతున్ననేటిజన్లు!

స్పీడుగా కదులుతున్న కారు బోనెట్ నుండి విండ్‌షీల్డ్‌కి పాకుతున్న పాము. అదేంటి వేగంగా వెళ్తున్న కారుపైన పాము ఎలా వచ్చిందా అనే కదా మీ సందేహాం.. ఆయితే ఈ వైరల్ వీడియో చూసేయండి మరీ!  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 07:49 PM IST
  • స్పీడుగా వెళ్తున్న కారు బోనెట్ పై పాము
  • నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో
  • పాము గురించి ఆరా తీస్తున్న నెటిజన్లు
Viral Video:120కి.మీ స్పీడులో వెళ్తున్న కారు అద్దంపై పాము... ఆశ్చర్యపోతున్ననేటిజన్లు!

Snake on Car Bonet: సోషల్ మీడియా... ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.. ఈ రోజు మరో వైరల్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాము.. పాము అంటే అలర్జీ, భయం ఉన్నవారు మాత్రం ఈ వీడియో చూడకపోవటం మంచిది. 

ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు కానీ, స్పీడుగా వెళ్తున్న కారు బోనెట్‌పై పామును చూసి ప్రయాణికులకు ఏం అనిపించిందో తెలియదు కానీ, వీడియో చూసే వారికీ మాత్రం ఆశ్చర్యానికి గురయ్యారు.

Also Read: Lakhimpur Kheri Violence: లఖింపూర్ ఖేర్ ఘటనలో రైతులపైకి కారు ఎలా దూసుకెళ్లిందో చూడండి.. Video

కారు లోపల ప్రయాణికులు వేగంగా కారు డ్రైవ్ చేస్తున్నారు.. అకస్మాత్తుగా వారి కారు బోనెట్‌పై పాము కదులుతూ వెళ్లటం తారసపడింది. ఇంకేం ఉంది, పక్కనే ఉన్న సెల్ ఫోన్ కెమెరాకు పని చెప్పారు. మొదటగా ఆ పాము కారు బోనెట్ పైన అటు ఇటు కదిలింది.  

అది గమనించిన ప్రయాణికులు కారును రోడ్డు పక్కన ఆపగానే ఆ పాము నెమ్మదిగా కారు విండ్ స్క్రీన్ పైకి ఎక్కింది. 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో అంత స్పీడుగా కారు వెళ్తున్నా కూడా పాము కారు బోనెట్‌,  విండ్ స్క్రీన్ పైకి ఎలా ఎక్కింది అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  

Also Read: Telangana Assembly Session 2021: దళితబంధు ఉపపోరు కోసం కాదు..దళితుల అభివృద్దికే : KCR

వైరల్ హాగ్ (ViralHog)అనే యూ ట్యూబ్ ఛానెల్ వారు ఈ వీడియోని పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్ అవటం, వేలల్లో వ్యూస్ రావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొంత మంది "అదే పరిస్థితుల్లో నేను ఉంటే  గుండె ఆగిపోయేది అని కామెంట్ చేస్తుంటే".. మరి  కొంత మంది "పాము అంత స్పీడ్ లో కారుపైకి ఎలా వచ్చింది" అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.. మరి కొంత మంది "ఆ పాము ఏ జాతికి చెందిందో వెతికే పనిలో ఉన్నారు". 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News