Train Journeys Before Covid-19: కరోనావైరస్ (Coronavirus ) వల్ల ప్రపంచం మారిపోయింది. సహజంగా మనిషి ఇష్టపడే ఎన్నో పనులు చేయకుండా ఆగిపోతున్నాం. మళ్లీ ఎప్పుడు పాతరోజులు వస్తాయో అని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అప్పట్లో.. అంటూ కరోనావైరస్ రాక ( Befofe coronavirus ) ముందు రోజులు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వాటిలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ట్రైన్ ప్రయాణాలే. సంవత్సానికి కనీసం నాలుగైదు సార్లు ప్రయాణించే వాళ్లు కూడా ఈ రోజు అత్యవసరం అయితే కానీ ట్రైన్ జర్నీ చేయడం లేదు. ప్రస్తుతం అదే సేఫ్. కానీ ట్రైన్ జర్నీ మిస్ అయ్యే వాళ్లకోసం ఈ చిన్న వీడియో కాస్త ఆనందాన్ని అందించగలదు. చూడండి. ( Acharya Firstlook: ఆచార్య ఫస్ట్ లుక్ విడుదల తేది ఫిక్స్ ? )
One of the most beautiful train journeys of the world.@incredibleindia @ipskabra @NatGeoTravel @BBC_Travel
via- Jithin ronez pic.twitter.com/VEX6Ladoe0— Ankur Rapria, IRS (@ankurrapria11) July 26, 2020
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో బాగా వైరల్ అవుతోంది. దీనికి కారణం అత్యంత అందమైన లొకేషన్ నుంచి ఈ ట్రైన్ ప్రయాణించడమే. ఈ వీడియో గురించి దర్యాప్త చేయగా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ట్రైన్ గోవా సమీపంలోని దూధ్ సాగర్ ఫాల్స్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలోని వీడియో ఇది.
ఇంత అందమైన ట్రైన్ జర్నీ చేయాలని మీక్కూడా అనిపిస్తే కొంత కాలం ఆగితే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ప్రయాణాలు అంత సేఫ్ కాదు. అందుకే మీ కోసం కరోనావైరస్ సంక్రమణ ప్రారంభం కాకముందు ప్రపంచం ఎలా ఉండేదో తరచూ షేర్ చేస్తుంటాం. చూసి ఎంజాయ్ చేయండి.
RGV Says: 2024లో లక్ష శాతం నువ్వే సీఎం..జై పవర్ స్టార్
Rafale Aircraft: త్వరలో భారత్ చేరుకోనున్న ఐదు రాఫెల్ విమానాలు