Takshak Nag Snake Viral Video: ఝార్ఖండ్‌లో అత్యంత అరుదైన పాము కనిపించింది. మహాభారతంలో ప్రస్తావించిన తక్షక నాగు ప్రత్యక్షమైంది. రాంచీలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన ఈ పామును చూసి అధికారులు భయపడిపోయారు. పామును చూసిన ప్రజలు వెంటనే స్నేక్ క్యాచర్ రమేష్ కుమార్ మహతోకు కాల్ చేశారు. ఆయన వచ్చి పామును రక్షించాడు. అయితే స్నేక్ క్యాచర్ పాముతో కాసేపు ఆడుకోవడంతో అక్కడ జనాలు భారీగా గుమిగూడారు. అరుదైన పామును వింతగా వీక్షించారు. ఝార్ఖండ్‌లో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఈ పాము విషపూరితమైనదని.. చిన్న బల్లలను తింటుందన్నారు.
Also Read: YS Jagan: చంద్రబాబు పాలనలో వరదలా పారుతున్న మద్యం.. బెల్టుషాపు లేని వీధి, గ్రామం లేదు
తక్షక నాగు మనుషులకు అంత ప్రమాదం కాదన్నారు స్నేక్ క్యాచర్. ఈ పాము వయసు 12 ఏళ్లు ఉంటుందన్నారు. తక్షక నాగు కనిపించడం అరుదైన ఘట్టం అని అన్నారు. దీని భద్రత కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నామని.. బిర్సా జూలాజికల్ పార్క్‌లోని స్నేక్ హౌస్‌లో ఉంచుతున్నట్లు చెప్పారు. పాము శరీరం ఆభరణాల మాదిరి ప్రకాశవంతంగా వెలుగుతోంది. ప్రస్తుతం తక్షక నాగు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ వింతపాము వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు. అదే సమయంలో తక్షక నాగు చరిత్రను తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి గురువుతున్నారు. అక్కడ బాగా చూసుకుంటారు. ప్రస్తుతం నా కస్టడీలో ఉందని, రేపు స్నేక్ హౌస్‌కి తరలించనున్నారు.
झारखंड में मिला राजा परीक्षित को काटने वाला 'तक्षक नाग'
झारखंड के रांची में मिला ऑरनेट फ्लाइंग स्नेक, अपनी खूबसूरती और उड़ने की क्षमता के लिए जाना जाता है यह सांप, राजा परीक्षित से भी जुड़ी है कहानी
📸 @NavbharatTimes#HornetFlyingSnake #Ranchi #JharkhandWildlife #FlyingSnake pic.twitter.com/9AQkhnuvCR— Sanskar Sojitra (@sanskar_sojitra) December 3, 2024
ద్వాపర యుగం చివరలో భారతదేశాన్ని పరీక్షిత్తు అనే రాజు పరిపాలించాడు. ఆయన తక్షకుడనే పాము కాటు కారణంగా మరణించినట్లు మహాభారతంలో చదువుకున్నాం. తక్షకుడు నాగ వంశస్థుడని చెబుతారు. ఈ పాము వందల ఏళ్లు జీవిస్తుందట. ఎక్కువగా చెట్ల మీదనే జీవిస్తుంది. గాల్లో వంద అడుగుల దూరం వరకు ఎగిరి వెళుతుందని చెబుతున్నారు. ఈ పామును ఫ్లయింగ్ స్నేక్ అని కూడా పిలుస్తారు. దట్టమైన అడవులలో ఎక్కువగా కనిపిస్తుంది.
Also Read: YS Jagan: దేశ చరిత్రలోనే చంద్రబాబు బాదుడు ఎవరూ చేసి ఉండరు.. ఏపీలో భయంకర పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook