Ghaziabad School Principal Brutally Attacks On Female Teacher: సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. ఈ వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉండి నవ్వుతెప్పిస్తే, మరికొన్నిమాత్రం.. ఇదేం రా నాయన అంటూ ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. మనం తరచుగా బస్సులలో మహిళలు కొట్టుకొవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలలో చూస్తున్నాం. అదేవిధంగా.. మరికొన్నిసార్లు.. అమ్మాయిలు కూడా ఒకే లవర్ కోసం కొట్టుకున్న ఘటనలు కూడా వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా. నల్లాల దగ్గర మహిళలు గొడవలు పడటం వంటివి కూడా చూశాం. స్కూళ్లలో టీచర్లు వాగ్వాదం చేసుకొవడం, స్టూడెంట్స్ కొట్టుకొవడం వంటివి కూడా వార్తలలో నిలిచింది.తాజాగా, ఘజియాబాద్ లో మసూరీ లో ఒక పాఠశాలలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
देखिए विद्यालय में मारपीट करती दो महिलाओं का वीडियो वायरल हुआ
बताया जा रहा है गाज़ियाबाद जय प्रकाश नारायण सर्वोदय विद्यालय की प्रधानाचार्या पर कंप्यूटर ऑपरेटर ने मारपीट का आरोप लगाया,विवाद कंप्यूटर क्लास लेने को लेकर हुआ था #वायरलवीडियो #up pic.twitter.com/yZVSF89via— Lavely Bakshi (@lavelybakshi) March 8, 2024
పూర్తి వివరాలు..
ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ స్కూల్ లో ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. మసూరీలోని జైప్రకాష్ నారాయణ్ సర్వోదయ విద్యాలయం స్కూలో లో ఉపాధ్యాయురాలిపై, ప్రిన్సిపాల్ దాడికి పాల్పడింది.ఈ ఘటనపట్ల అందరు షాకింగ్ కు గురౌతున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ పూనమ్ కుష్వాహ, తన తోటి కంప్యూటర్ టీచర్ అన్షికను క్యాబిన్ లోకి పిలిచింది. తనకు బదులుగా ఒక క్లాసును తీసుకొవాలని అన్షికను, పూనమ్ కోరింది. కానీ దీనికి అన్షిక ఒప్పుకోలేదు. క్లాసు తీసుకునేది లేదని తెగేసి చెప్పింది. దీంతో ప్రిన్సిపాల్ రెచ్చిపోయింది.
నా మాటనే కాదంటావా.. అని తన క్యాబిన్ లో గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా అన్షికను జుట్టుపట్టుకుని వీపు మీద పిడిగుద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా కులంపేరుతో కూడా తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఇప్పుడిది రచ్చగా మారింది. విద్యార్థులకు విద్యా, బుద్ధులు చెప్పాల్సిన టీచర్ ఇలా ప్రవర్తించడమేంటని అందరు కామెంట్లు పెడుతున్నారు.
Read More: Pranitha Subhash: అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న ప్రణీత, లేటెస్ట్ పిక్స్ వైరల్
ఇక ప్రిన్సిపాల్, తోటీ ఎంప్లాయ్ ను ఇలా కొట్టడం ఏంటని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై యూపీ విద్యాశాఖ సీరియస్ గా స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కేవలం క్లాసు విషయమై గొడవ పడ్డారా.. మరేదైన కారణాలు ఉన్నాయా.. అన్న కోణంలో విద్యాశాఖ అధికారులు ఆరాతీస్తున్నారు. ఒక మహిళ అయి ఉండి సాటి, మహిళను ఇష్టమున్నట్లు కొట్టడం ఏంటని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook