Viral Video of a Bihar Boy: బీహార్‌కి చెందిన ఓ ఆరో తరగతి బాలుడితో ఓ రిపోర్టర్ చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిపోర్టర్ ప్రశ్నలకు ఆ బాలుడు చెప్పిన సమాధానాలు నెటిజన్లను కడుపుబ్బా నవిస్తున్నాయి. ఇంగ్లీష్ అర్థం కాక కొంత, సమాధానాలు తెలియక కొంత ఆ బాలుడు గందరగోళానికి గురయ్యాడు. అయితే తప్పు సమాధానం చెప్పినా సరే.. చాలా కాన్ఫిడెంట్‌గా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మొదట ఆ రిపోర్టర్.. నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అని ఆ బాలుడిని అడిగాడు. అందుకు ఆ బాలుడు 'వంకాయ' అని సమాధానమిచ్చాడు. రిపోర్టర్ 'సబ్జెక్ట్' గురించి అడిగితే.. ఆ బాలుడు 'సబ్జీ (కూర)' అనుకుని పొరబడ్డాడు. రిపోర్టర్ మరోసారి అదే ప్రశ్న అడగటంతో.. తేరుకుని 'ఇంగ్లీష్' అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత.. ఇంగ్లీషు పోయెమ్స్ ఏమైనా గుర్తున్నాయా అని రిపోర్టర్ బాలుడిని అడిగాడు. మళ్లీ పొరబడ్డ బాలుడు.. 'అవును.. 55.. యాభై ఐదు వరకు నాకు స్పెల్లింగ్స్ వచ్చు.. వంద వరకు కూడా..' అని బదులిచ్చాడు.
రిపోర్టర్ పోయెమ్స్ గురించి అడిగితే బాలుడు స్పెల్లింగ్స్ అనుకుని పొరబడ్డాడు. ఇక దేశ ప్రధాని ఎవరని అడగ్గా... వెంటనే 'నితీశ్ కుమార్' (Nitish Kumar) అని చెప్పాడు. ఆ వెంటనే.. కాదు 'లాలూ ప్రసాద్ యాదవ్' అని చెప్పాడు. పక్కనే ఉన్న మిత్రులు 'మోదీ' అని చెప్పడంతో.. ఆ బాలుడు కూడా 'మోదీ' అని బదులిచ్చాడు. పూర్తి పేరు చెప్పాల్సిందిగా రిపోర్టర్ అడగ్గా.. 'మోదీ సర్కార్..' అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
Sawaal-Jawaab chhodo,🥰🥰
Confidence hona chahiye...💪💪🤣🤩🤩🤪🤪🤪 pic.twitter.com/dl94lVtXG5
— Rupin Sharma (@rupin1992) January 12, 2022
తప్పు సమాధానాలు చెప్పినా సరే.. నవ్వుతూ, కాన్ఫిడెంట్‌గా అతను బదులిచ్చిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ.. ఈ వీడియోను (Viral Video) తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'సవాల్-జవాబ్ వదిలిపెట్టు.. కాన్ఫిడెన్స్ కావాలి..' అని ఆ పోస్టుకు తన కామెంట్‌ను జోడించాడు. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేయగా.. మరికొందరు ఇది మన విద్యా వ్యవస్థ పనితీరును పట్టిస్తోందని వీడియోపై కామెంట్ చేయడం గమనార్హం.
Also Read: రైల్వే ప్రయాణికులకు షాక్.. అమలులోకి కొత్త రూల్స్.. ఇకపై రైల్లో అలా కుదరదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook