Viral news: సునీత ఫొటోకు.. ఎఫ్​బీ యూజర్ హాట్​ కామెంట్​ అతడి భార్య క్రేజీ రిప్లై

Viral news: సింగర్ సునీత సోషల్​ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోకు ఓ వ్యక్తి చేసిన కామెంట్​కు.. అతడి భార్య ఇచ్చిన రిప్లై.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కామెంట్​ ఏమిటంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 01:34 PM IST
  • సింగర్ సునీత ఫొటోకు.. ఓ వ్యక్తి హాట్ కామెంట్​
  • రిప్లై ఇచ్చిన అతడి భార్య
  • ఉన్నాడా పోయాడా? అంటూ నెటిజన్ల జోకులు
Viral news: సునీత ఫొటోకు.. ఎఫ్​బీ యూజర్ హాట్​ కామెంట్​ అతడి భార్య క్రేజీ రిప్లై

Viral news: సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను పంచుకుంటుంటారు. కొన్ని సార్లు అవి వివాదాస్పదమవుతుంటాయి. మరికొన్ని సార్లు అవి ఫన్నీగా ఉంటాయి. అయితే ఈ మధ్య ఫేస్​బుక్​లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చేసిన కామెంట్​కు.. అతడి భార్య రిప్లై ఇచ్చింది. దీనితో ఇప్పుడు.. ఈ కామెంట్స్​ వైరల్​గా మారాయి. ఇంతకీ కామెంట్స్​లో ఏముంది తెలియాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే.

భర్త కామెంట్​, భార్య రిప్లై..

సింగర్ సునీత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. అమెకు సంబంధించిన ఫొటోలు, అప్​డేట్స్​ను పంచుకుంటుంటారు. ఇలానే అమె ఇటీవల ఓ కొత్త ఫొటోను అప్లోడ్ చేశారు. ఆ ఫొటోను 18 వేలకుపైగా యూజర్లు లైక్​ చేశారు.

అయితే మరికొందరేమో.. అమె ఫొటోను పొగుడుతూ కామెంట్స్ చేశారు. చాలా అందంగా ఉన్నారంటూ.. ఫొటో బాగుందంటూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో కొత్తేముంది సెలెబ్రెటీలు ఫొటోలు పెడితే.. ఇలాంటి కామెంట్స్ సాధారణమేగా అనుకుటే పొరపాటే.. ఇక్కడే అసలు ట్విస్ట్​ ఉంది.

ట్విస్ట్​ ఏమిటంటే..

సునీత అప్​లోడ్ చేసిన ఆ ఫొటోకు 'రజిని బాబు' అనే వ్యక్తి.. 'చాలా అందంగా కనిపిస్తున్నారు' అంటూ ఇంగ్లీష్​లో కామెంట్​ చేశాడు. అయితే.. ఆ కామెంట్ చేసిన వ్యక్తి భార్య కూడా ఫేస్​బుక్​లో.. ఉండటంతో ఆ కామెంట్​ను చూసింది. అంతే కాదు.. అతడి కామెంట్​కు 'ఓ అవునా' అంటూ రిప్లై కూడా ఇచ్చింది.

కొంత మంది ఆ ఇద్దరి ప్రొఫైల్స్ చూసి.. వారిద్దరు భార్యా, భర్తలని తెలుసుకున్నారు. దీనితో వారిద్దరి ప్రొఫైల్స్​, సునీత ఫొటో కింద వారి కామెంట్స్ స్క్రీన్​ షాట్స్​ తీసి ట్విట్టర్​ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​లో షేర్​ చేస్తున్నారు.

దీనితో ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ యూజర్ రజిని బాబును ఉద్దేశిస్తూ 'ఉన్నాడా.. పోయాడా' అంటూ కామెంట్​ చేశాడు. మరో యూజర్ ఇంట్లో వాళ్లు ఫేస్​బుక్​లో ఉన్నారని చూసుకోవాలి కద బ్రో అంటూ స్పందించాడు. ఇంకా చాలా మంది తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Also read: Optical Illusion Photo: ఈ చిత్రంలో ఓ ఆంగ్ల పదం దాగుంది? అదేంటో చెప్తే మీరు మేధావే!

Also read: KGF 2 Viral Video: వారెవ్వా.. కేజీఎఫ్ 2లో రాఖీభాయ్​లా అదరగొట్టిన కిలి పాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News