Viral News: ఆస్పత్రిలో ఏడ్చినందుకు రూ.3,100 బిల్లు.. షాక్ లో పేషెంట్!

Viral News: ఆస్పత్రిలో ఏడ్చినందుకు గానూ ఓ మహిళకు తన ఆస్పత్రి బిల్లులో ఏకంగా 40 డాలర్లు అనగా రూ. 3,100 ఎక్కువగా వసూలు చేశారు. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా.. ఇప్పుడా పిక్ వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 05:07 PM IST
Viral News: ఆస్పత్రిలో ఏడ్చినందుకు రూ.3,100 బిల్లు.. షాక్ లో పేషెంట్!

Viral News: మీరు చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే.. అక్కడ భావోద్వేగంతో ఎప్పుడైనా ఏడ్చారా? అలా ఏడ్చినందుకు ఆస్పత్రి వర్గాలు జరిమానా విధించారా? ఏడిస్తే ఫైన్ వేయడం ఏంటని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే! న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రిలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో ఏడ్చినందుకు ఓ మహిళకు అదనంగా 40 డాలర్లు అనగా రూ. 3,100 వరకు బిల్లు అదనంగా వేశారు. 

ఏడిస్తే రూ. 3 వేలు కట్టాల్సిందే!

న్యూయార్క్ నగరానికి చెందిన యూట్యూబర్ కామిల్లె జాన్సన్ అనే ఆమె ఇటీవలే ఆస్పత్రిలో చేరింది. తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆస్పత్రి బిల్లుతో పాటు ఆస్పత్రిలో తన సోదరి ఏడ్చినందకు గానూ 40 డాలర్లు బిల్లుతో కలిపి ఇచ్చారు. 

"నా సోదరి ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల గత కొన్ని రోజులగా ఇబ్బంది పడుతోంది. చివరికి ఆమెను వైద్యుని వద్దకు తీసుకెళ్లాం. అయితే ఆమె ఆస్పత్రిలో ఏడ్చినందుకు గానూ 40 డాలర్లు (అనగా రూ. 3,100) బిల్లులో అదనంగా వసూలు చేశారు" అని ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో తాను పొందిన చికిత్స కంటే ఏడ్చినందుకు ఎక్కువ బిల్లును వసూలు చేసినట్లు కామిల్లె జాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: Optical Illusion Photo: ఈ చిత్రంలోని ఆకుల మధ్య ఓ కప్ప దాగుంది! అదెక్కడ ఉందో కనిపెడతారా?

Also Read: Funny Viral Video: పెళ్లిపందిరిలో కోపంతో పెళ్లి కుమార్తె ఎంత పని చేసిందో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News