Online Food Order: ఆన్‌లైన్‌లో చికెన్ ఆర్డర్ చేసిన కస్టమర్... ఫుడ్ ప్యాక్‌లో నమిలిపెట్టిన బోన్స్ చూసి షాక్..

Man Receives Chewed Chicken Bones: ఆన్‌లైన్‌లో చికెన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి ఫుడ్ ప్యాక్‌లో నమిలిపెట్టిన బొక్కలను చూసి షాక్ తిన్నాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 3, 2022, 01:43 PM IST
  • ఆన్‌లైన్‌లో చికెన్ ఆర్డర్
  • ఫుడ్ ప్యాక్‌లో నమిలిపెట్టిన బోన్స్
  • షాక్ తిన్న కస్టమర్
Online Food Order: ఆన్‌లైన్‌లో చికెన్ ఆర్డర్ చేసిన కస్టమర్... ఫుడ్ ప్యాక్‌లో నమిలిపెట్టిన బోన్స్ చూసి షాక్..

Man Receives Chewed Chicken Bones: బాగా ఆకలితో ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో చికెన్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రాగానే కడుపు నిండా లాగించేయాలనుకున్నాడు. అనుకున్నట్లు గానే ఆర్డర్ వచ్చింది. కానీ ప్యాక్ విప్పి చూస్తే అందులో చికెన్ లేదు. ఎవరో నమిలిపెట్టిన చికెన్ బోన్స్ కనిపించాయి. అంతేకాదు, అందులో ఒక లెటర్ కూడా కనిపించింది. ఆ లెటర్‌లో 'క్షమాపణలు' కోరుతున్నట్లు రాసి ఉంది.  ఇంతకీ అందులో చికెన్ ఏమైంది.. ఆ లెటర్ ఎవరు రాశారు...

అందులో చికెన్‌ని డెలివరీ బాయే తినేశాడు. అలా చేసినందుకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాసి ఫుడ్ ప్యాక్‌లో పెట్టి ఇచ్చాడు. 'నేను చాలా ఆకలితో ఉన్నాను. తట్టుకోలేకపోయాను. మీకు డెలివరీ చేయాల్సిన చికెన్‌ని నేనే తిన్నాను. అందుకు క్షమాపణలు. ఈసారికి నా తిండి కోసం మీరు డబ్బులు చెల్లించారని అనుకోండి. ఇక నేనీ ఉద్యోగాన్ని వీడబోతున్నాను. ఇట్లు డోర్ డెలివరీ బాయ్' అని డెలివరీ బాయ్ ఆ నోట్‌లో పేర్కొన్నాడు. కానీ ఆ నోట్ చూశాక ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి మరింత మంట పుట్టింది.

ఫుడ్ ప్యాక్‌లో ఉన్న బోన్స్‌ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పెట్టాడు. ఇది తాను ఎంతమాత్రం ఉపేక్షించనని మండిపడ్డాడు. ఫ్రైడ్ చికెన్ వింగ్స్ ఆర్డర్ చేస్తే బోన్స్ డెలివరీ చేయడమేంటని ప్రశ్నించాడు. ఇప్పుడు నేనేం చేయాలంటూ నెటిజన్లను సలహా కోరాడు.నెటిజన్లు ఈ వీడియోపై  రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఫన్నీ కామెంట్స్‌తో రిప్లై ఇస్తున్నారు. గత ఆగస్టు నెలలో టిక్‌టాక్‌లో ఈ వీడియో అప్‌లోడ్ అయింది. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు. ఈ వీడియోకి ఇప్పటివరకూ 2 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. 

Also Read: Kcr Target Jr Ntr: బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనున్నారా? కేసీఆర్ కు అందుకే టార్గెట్ అయ్యారా?  

Also Read: BJP VS TRS: బీజేపీ విమోచనాస్త్రం.. రంగంలోకి కేంద్ర బలగాలు.. సెప్టెంబరు17న ఏం జరగనుంది.. టీఆర్ఎస్ ఏం చేయనుంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News