Viral Video: ఒక్క సెకండ్ లేట్ అయితే ఈ వ్యక్తి పని అయుండేది.. వర్షాకాలంలో జాగ్రత్త మరి!

Drainage Viral Video, A Man escaped from Drainage roof acident. ఓ డ్రైనేజీ పై కప్పు కూలిపోయింది. ఓ వ్యక్తి ఒక్క సెకండ్ తేడాతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 3, 2022, 06:06 PM IST
  • పెను ప్రమాదం నుంచి బయట పడిన వ్యక్తి
  • ఒక్క సెకండ్ లేట్ అయితే..
  • కొద్దిసేపటి క్రితమే పోస్ట్ చేసినా
Viral Video: ఒక్క సెకండ్ లేట్ అయితే ఈ వ్యక్తి పని అయుండేది.. వర్షాకాలంలో జాగ్రత్త మరి!

A Man escaped from Drainage roof acident: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు ముంపు ప్రాంతాలు మొత్తం మునిగిపోతున్నాయి. ఇక చాలా రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాత ఇల్లులు, బిల్డింగ్స్ సైతం కూలిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ డ్రైనేజీ పై కప్పు కూలిపోయింది. ఓ వ్యక్తి ఒక్క సెకండ్ తేడాతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సీసీటీవీలో రికార్డు అయిన వీడియో ప్రకారం... రోడ్డు పక్కనే ఓ డ్రైనేజీ ఉంది. యమరాజ్ అనే వ్యక్తి లంచ్ సమయంలో మనీ కోసం ఏటీఎం దగ్గరకు వెళుతుంటాడు. రోడ్డు మీది నుంచి నడుచుకుంటూ వచ్చిన అతడు డ్రైనేజీ పై కప్పుపై కాలు వేయగానే అది షేక్ అవుతుంది. ఆ వ్యక్తి ఇంకో అడుగు వేయగానే.. డ్రైనేజీ పై కప్పు ఒక్కసారిగా కూలిపోతుంది. అప్పటికే యమరాజ్ మరో అడుగు ముందుకు వేయడంతో పెను ప్రమాదం నుంచి బయటపడతాడు. ఇది చూసిన అతడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. 

డ్రైనేజీ పై కప్పు కూలిన వీడియోను సాగర్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ లక్కీ ఎస్కేప్ అని కామెంట్స్ చేస్తున్నారు. వర్షాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండండి అని సలహాలు ఇస్తున్నారు. ఈ వీడియోను కొద్దిసేపటి క్రితమే పోస్ట్ చేసినా నెట్టింట దూసుకుపోతోంది. 2 వేలకు పైగా కామెంట్స్, 11 వేల లైక్స్ వచ్చాయి.  

Also Read: మొసలితో ఆడుకోవడం ఏంది సామీ.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉడలేరు!

Also Read: Naga Chaitanya: నాగ చైతన్య, సమంత కలిసి నటించబోతున్నారా..చైతూ ఏమన్నాడంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News