Bride and Groom Fight: స్టేజ్‌పైనే కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!

Bride slaps groom during wedding ceremony. ఒక చిన్న విషయానికి వధూవరులు గొడవపడి ఒకరినొకరు కొట్టుకున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 10:27 PM IST
  • స్టేజ్‌పైనే కొట్టుకున్న వధూవరులు
  • కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు
  • నెట్టింట మాత్రం హల్చల్
Bride and Groom Fight: స్టేజ్‌పైనే కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!

Fight between Bride and Groom in the marriage Stage: మాములుగా పెళ్లి అంటేనే సందడిసందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల, బంధువుల ఆప్యాయత, అనురాగాలతో సందడి వాతావరణం ఉంటుంది. ఇక నూతన వధూవరులు అయితే సంతోషంలో మునిగితేలుతారు. స్టేజ్‌పైన వధూవరులు ఆనందంగా ఉంటారు. అయితే ఒక్కోసారి చిన్నపాటి పొరపాటు కూడా నూతన వధూవరుల మధ్య పెద్ద దుమారం రేపుతుంది. ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఒక చిన్న విషయానికి వధూవరులు గొడవపడి ఒకరినొకరు కొట్టుకున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో వేదికపై నూతన వధూవరులు నిలబడి ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు. వధూవరులు వేదికపై నిల్చుని ఫోటోకు పోజిలిస్తున్నారు. దండలు మార్చుకున్న అనంతరం.. వధువు ప్రేమతో వరుడికి స్వీట్ తినిపించాలని చూస్తుంది. వరుడు మాత్రం ఫోటోకు పోజులిస్తుంటాడు. చాలాసేపు వరుడు ఫొటోలకు పోజులివ్వడంతో వధువుకు ఓపిక నశిస్తుంది. దాంతో చేతిలో ఉన్న స్వీటును వరుడు ముఖానికేసి కొడుతుంది వధువు. 

స్టేజ్‌పైనే వధువు కొట్టడంతో వరుడికి చిర్రెత్తుకొస్తుంది. ఆవేశంలో వధువు చెంప చెళ్లుమనిపిస్తాడు. వధువు కూడా తగ్గేదేలే అంటూ.. వరుడిని ఒకటి పీకుతుంది. ఆపై ఒకరినొకరు పొట్టుపొట్టుగా కొట్టుకుంటారు. ఇది చుసిన స్టేజ్‌పైన ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో పాతదో లేదో తెలియదో కానీ నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SᶸᵖᵉᣴMan ⏤͟͟͞͞★ (@only._.sarcasm_)

స్టేజ్‌పైనే వధూవరులు కొట్టుకున్న వీడియోను సతీష్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ రాగా.. 2 వేలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు 1500లకు పైగా షేర్స్ వచ్చాయి. ఇక ఆలస్యం ఎందుకు మీరు వీడియో చూసి నవ్వుకోండి. మరోవైపు ఈ వీడియోకు మీమ్స్ కూడా తయారు చేశారు. సల్మాన్ ఖాన్ సహా పలువురు నవుతున్నట్లు మీమ్స్ చేశారు. 

Also Read: Janhvi Kapoor Hot Pics: ప్రకృతిలో పరవశించిపోతున్న జాన్వీ కపూర్.. హాట్ అందాలు చూస్తే అంతే సంగతులు!

Also Read: Eesha Rebba Pics: స్టైలిష్ లుక్‌లో ఈషా రెబ్బా.. తెలుగమ్మాయి మెరిసిపోతుందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News