Chinese Soldiers Crying: వైరల్ అవుతున్న చైనా సైనికులు ఏడుస్తున్న వీడియో

భారతదేశం ( India ) సాహసాన్ని చూసి చైనాకు ( China ) భయం కలుగుతోంది. దీనికి ఉదాహరణగా ఒక వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. 

Updated: Sep 23, 2020, 11:24 PM IST
Chinese Soldiers Crying: వైరల్ అవుతున్న చైనా సైనికులు ఏడుస్తున్న వీడియో

భారతదేశం ( India ) సాహసాన్ని చూసి చైనాకు ( China ) భయం కలుగుతోంది. దీనికి ఉదాహరణగా ఒక వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈ వీడియోలో చైనా సైనికులు భారతీయ సైనికులను ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు. ఈ వీడియోను తైవాన్ కు (Taiwan ) చెందిన ఒక వైబ్ సైట్ తన లైవ్ న్యూస్ లో ప్రసారం చేసింది. 

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

ఈ వీడియోను చూసిన పాకిస్తాన్ కు ( Pakistan ) చెందిన ప్రముఖ కమీడియన్ జైద్ హామీద్ తన ట్విటర్ హ్యండిల్ లో షేర్ చేశాడు.

చైనా సైనికులు భారతీయ సైనికులతో, అమెరికా సైనికులతో పోరాటానికి సిద్ధం అంటూ అక్కడి అధికారులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది. ఆ వాస్తవం ఈ వీడియోలోనే ఉంది. ప్రపంచం ముందు తమ వీరత్వం గురించి ప్రకటించుకునే చైనా. తన సైనికులు ఇలా ఏడుస్తూ.. యుద్ధానికి వెళ్లం అంటుంటే..ఏం సమాధానం ఇస్తుంది అనేది చూడాలి. 

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

ఈ వీడియో వాస్తవాధీన రేఖ ( LAC ) వద్ద ఇప్పటికే  విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది సైనికులది. ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి.

15 సెకన్ల ఈ వీడియోను తైవాన్ కు చెందిన ఒక వైబ్ సైట్ లైవ్ లో చూపించింది. చైనాకు చెందిన ఈ సైనికులు తమ భాషలో పాట పాడుతున్నారు. కానీ వారి ముఖం చూస్తే వారి పరిస్థితి ఎలా ఉందో మీరే గమనించవచ్చు. 

ఈ వీడియోతో భారత్ సైనికులు అంటే చైనా సైనికులు భయపడతారు అనేది స్పష్టం అవుతోంది. సాహసం, తెగువే ప్రాణంగా జీవించే ప్రతీ భారతీయ సైనికుడిని చూసి చైనా సైనికులు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే   ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR