Viral Video Of Talking Cactus Toy: ఇటీవల కాలంలో భారీగా పాపులారిటీ సాంపాదించుకున్న ఆట బొమ్మల్లో టాకింగ్ క్యాక్టస్ టాయ్ కూడా ఒకటి. మరీ ముఖ్యంగా ఈ మాట్లాడే క్యాక్టస్ బొమ్మలు వైరల్ అవడానికి కారణం వాటిని తయారుచేస్తోన్న కంపెనీలు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వడం వల్ల కాదు.. ఆ బొమ్మలతో పిల్లలు ఆడుతున్న వీడియోలను షూట్ చేస్తోన్న పేరెంట్స్ ఆ వీడియోలను షాట్స్, రీల్స్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటమే. అలా పోస్ట్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతుండటంతో ఇప్పుడు క్యాక్టస్ టాయ్స్ వీడియోస్‌కి మంచి ఆధరణ కనిపిస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా వీక్షకులను అదే విధంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. టాకింగ్ క్యాక్టస్ టాయ్‌తో ఆడుతున్న ఓ చిన్నారి తనకు తెలియకుండానే ఆ బొమ్మతో సీరియస్‌గా ముచ్చటలో మునిగిపోయింది. తను చెప్పే మాటలకు రిప్లై ఇస్తున్న టాకింగ్ క్యాక్టస్ టాయ్ ఒక ఆట బొమ్మ అనే విషయం తెలిసో తెలియకో కానీ ఆ చిన్నారి తన ఎదురుగా ఉన్న బొమ్మతోనే వాదనకు దిగుతోంది.
Baby has an in depth conversation with a talking cactus toy 🌵🍼😂#ViralHog #Babies #Cute #Funny pic.twitter.com/xmQSP0T8PR
— ViralHog (@ViralHog) January 24, 2023
ఈ వైరల్ వీడియో చూడ్డానికి మరో రకంగానూ ఉంది అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. టాకింగ్ క్యాక్టస్ టాయ్ కొనుగోలు చేసేటప్పుడు ఆ బొమ్మ సరిగ్గా పని చేస్తుందా లేదా అని చెక్ చేయడానికి పెద్దలు ఎలాగైతే ఏదో ఒకటి మాట్లాడి చూస్తారో... ఈ చిన్నారి కూడా అచ్చం అలాగే చెక్ చేస్తున్నట్టుగా ఉంది. నేను ఏది చెబితే అది నువ్వు తిరిగి చెబుతావా లేదా అన్నట్టుగా ఆ ఆట బొమ్మ ముందు ఈ చిన్నారి గట్టిగా గట్టిగా అరుస్తూ.. ఆ బొమ్మ కూడా అరిచేలా చేస్తూ బొమ్మ క్వాలిటీని చెక్ చేస్తున్నట్టుగా ఉంది కదూ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Rs. 54 Lakhs Bill For 10 Days: 10 రోజుల చికిత్సకు 54 లక్షల బిల్లు.. పేషెంట్‌ని విడిచేది లేదంటున్న హాస్పిటల్
ఇది కూడా చదవండి : Viral Video: విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా
ఇది కూడా చదవండి : Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook