Viral Video Python climbs to tree : కొండచిలువ టెక్నిక్ భలే ఉందే.. ఇలా కూడా చెట్టు ఎక్కొచ్చా!!

Viral Video Python climb to tree uses amazing technique : సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొండచిలువ చెట్టు ఎక్కే వీడియో. టెక్నిక్‌తో చకచకా పైకి పాకుతూ వెళ్తున్న ఈ పాము వీడియో ట్విట్టర్‌‌లో వైర​ల్ అవుతోంది. ఈ వీడియో ఓ లుక్కేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 02:26 PM IST
  • సోషల్ మీడియాలో కొండచిలువకు సంబంధించిన వీడియో వైరల్
  • కొండచిలువ చెట్టు ఎక్కడం చూస్తే ఆశ్చర్యపోతాం
  • ఎంతో ఫాస్ట్‌గా చెట్టు ఎక్కిన కొండచిలువ
  • నెటిజెన్స్‌కు భలే నచ్చేసిన వీడియో
Viral Video Python climbs to tree : కొండచిలువ టెక్నిక్ భలే ఉందే.. ఇలా కూడా చెట్టు ఎక్కొచ్చా!!

Viral Video Python climbs tree Mesmerising Way by a hold and release movement Watch: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే ట్రెండ్ అవుతున్నాయి. పాములు (Snakes) చేసే రకరకాల విన్యాసాల వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. స్నేక్స్‌ సంబంధించి కొన్ని వీడియోలు (Snakes‌ Videos) చాలా ఫన్నీగా ఉంటుంటాయి. కొన్ని ఏమో ఆశ్యర్యానికి గురి చేసేలా.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. 

పాముకు (Snake) సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో (Social media) హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో కొండచిలువ (Python) చెట్టు ఎక్కడం చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతాం. ఆ కొండచిలువ ఒక టెక్నిక్‌తో (Technique‌) గట్టిగా గ్రిప్‌ తీసుకుని చెట్టును ఫాస్ట్‌గా పాకుతూ ఎక్కడం చూస్తే.. షాక్ అవుతాం. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. ఒక కొండచిలువ చెట్టును పాకుతూ ఉంటుంది. "కన్సర్టినా లోకోమోషన్" (concertina locomotion) అనే విధానంలో ఎంతో ఫాస్ట్‌గా ఈ కొండచిలువ చెట్టు ఎక్కడంతో ఈ వీడియో నెటిజెన్స్‌కు భలే నచ్చేసింది.

ఈ వీడియోలో కొండచిలువ హోల్డ్ అండ్ రిలీజ్ (hold and release) విధానం ద్వారా అంటే చెట్టును ఎక్కుతోంది. S షేప్‌లో (S-shaped) చెట్టును పాకుతూ క్షణాల్లో పైకి వెళ్తోంది. కొండచిలువ తన తల భాగంతో కాస్త పైకి పాకగానే.. తోక భాగం మొత్తం కూడా చెట్టుకు (Tree) చుట్టుకుంటూ ఉంటుంది. మళ్లీ కాస్త పైకి పాకగానే ఆ చెట్టుకు చుట్టుకున్న తోక భాగాన్ని వదిలేస్తూ ఉంటుంది.

Also Read : Nidhhi Agerwal Photos: బ్లాక్ శారీలో చందమామలా మెరిసిపోతున్న అందాల నిధి- ఫొటోలు వైరల్

అలా ఆశ్చర్యపరుస్తూ చకచకా పైకి పాకుతూ వెళ్తుంది కొండచిలువ. (Python) ఇప్పుడు ఈ వీడియో ట్విట్టర్‌‌లో చక్కర్లు కొడుతోంది. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ (IFS) ఆఫీసర్ ఈ వీడియోను ట్విట్టర్‌‌లో షేర్ చేశారు.

 

ఈ వీడియోను (Video) నెటిజెన్స్ రీ ట్వీట్ చేస్తుండడంతో మస్త్ వైరల్ అవుతోంది. అంతేకాదు రకరకాలుగా కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు నెటిజెన్స్. కొండచిలువ (Python) పోల్ డ్యాన్స్ చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Thaman Corona Positive: టాలీవుడ్ లో కరోనా కలవరం.. తమన్ కు కొవిడ్ పాజిటివ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News