Viral Video of a Couple Dance: రాత్రి పూట.. ఖాళీ రోడ్డుపై.. వీధి లైటు వెలుతురులో ఓ జంట డ్యాన్స్ ఇరగదీశారు. ప్రపంచాన్ని మరిచిపోయి హుషారుగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లోకి ఎక్కడంతో అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ జంట డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ డ్యాన్స్ ఎప్పుడు ఎక్కడ చేశారో తెలియదు కానీ సెప్టెంబర్ 5న ప్రేర్న మహేశ్వరి అనే ట్విట్టర్ యూజర్ దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
16 సెకన్ల నిడివి గల ఈ డ్యాన్స్ వీడియోకి ఇప్పటివరకూ 2,40,500 వ్యూస్ వచ్చాయి. 1544 రీట్వీట్స్ వచ్చాయి. డ్యాన్స్ వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ ఇష్టాన్ని తెలియజేస్తున్నారు. 'వాళ్లు అన్నాచెల్లెళ్లా లేక ప్రేమికులా అనేది అనవసరం. వాళ్ల స్పిరిట్, ఆ డ్యాన్స్‌ను ఆస్వాదిస్తున్న తీరు చాలా బాగుంది. ఖాళీ రోడ్డుపై వీధి లైటు వెలుతురులో వాళ్ల డ్యాన్స్ పొయెటిక్‌గా అనిపించింది.' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
మరికొందరు నెటిజన్లు.. బహుశా ఆ జంట ఇన్‌స్టా రీల్స్ కోసమో లేక ఏదైనా డ్యాన్స్ ఈవెంట్ కోసమో ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారంటూ కామెంట్స్ చేశారు. బహుశా నవరాత్రుల సందర్భంగా గార్భా నృత్యాలు చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారేమో అంటూ మరికొందరు నెటిన్లు కామెంట్స్ చేశారు. ఏదేమైనా ఇప్పుడీ వీడియో చాలా మంది మనసులు దోచేస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
This ❤️🫶🏻 pic.twitter.com/msaur0JvyF
— Prerna Maheshwari (@prernadaga21) September 5, 2022
Also Read:Indian Railway Tickets: ట్రైన్‌లో టాయిలెట్ పక్కన బెర్త్ రాకుండా టికెట్ ఇలా బుక్ చేసుకోండి..!
Also Read: Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook