Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి...

Congress Candidate in Munugode By Election : మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 9, 2022, 02:23 PM IST
  • పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్
  • ప్రకటించిన పార్టీ హైకమాండ్
  • రేసులో మిగతా ముగ్గురిని వెనక్కి నెట్టిన స్రవంతి
Munugode By Election : మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి...

Congress Candidate in Munugode By Election : మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉపఎన్నిక టికెట్ రేసులో చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపించినప్పటికీ నియోజకవర్గంలో పరిస్థితుల రీత్యా పాల్వాయి స్రవంతినే బరిలో దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. మొత్తం నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రతిపాదించగా.. అందులో స్రవంతి పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ ఇవాళ నిర్ణయాన్ని ప్రకటించింది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి స్రవంతి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. టికెట్ విషయంలో రేవంత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్రవంతి మాట్లాడిన ఓ ఫోన్ కాల్ ఆడియో కూడా బయటకు లీకైంది. అయినప్పటికీ స్రవంతిని, ఇతర అసంతృప్తులను బుజ్జగించి కృష్ణారెడ్డికే టికెట్ ఖరారు చేయబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో పాల్వాయి స్రవంతి వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపడం గమనార్హం.

పాల్వాయి స్రవంతి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 27 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి గతంలో ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మలిచిన పేరు ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడు బైపోల్ టికెట్ ఆమెకే ఇవ్వాలనే డిమాండ్ స్థానిక కాంగ్రెస్ శ్రేణుల నుంచి కూడా వ్యక్తమైంది. కాంగ్రెస్ అంతర్గత సర్వేలోనూ పాల్వాయి స్రవంతికే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కృష్ణారెడ్డి, రవికుమార్ గౌడ్, కైలాష్ నేతలను కాదని స్రవంతి వైపే మొగ్గుచూపింది.

Also Read: Match Fixed: టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా!

Also Read: Balapur Ganesh Laddu: పోటాపోటీగా సాగిన వేలంపాట.. రికార్డు ధర పలికిన బాలపూర్‌ లడ్డూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News