Suchetana Bhattacharya To Undergo For Sex-change Surgery: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కూతురు సుచేతనా భట్టాచార్య లింగమార్పిడి వ్యవహారం పతాక శీర్షికలకెక్కింది. శస్త్రచికిత్స చేయించుకోవడం ద్వారా లింగమార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్న సుచేతన భట్టాచార్య.. అందుకోసం అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి తాను మగాడిగానే పెరిగానని.. ఇకపై కూడా అలాగే బతకాలని కోరుకుంటున్నాను అని సుచేతన భట్టాచార్య స్పష్టంచేసింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని మగాడిగా మారాలని అనుకుంటున్నట్టు చెప్పడమే కాకుండా.. తన పేరును కూడా సుచేతన భట్టాచార్య నుంచి సుచేతన్ భట్టాచార్యగా మార్చుకోవాలని అనుకుంటున్నట్టు వెల్లడించింది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ధృవపత్రాల సేకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు.
ఇటీవలే ఎల్‌జిబిటిక్యూ వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన భట్టాచార్య.. అక్కడ తనకు తాను మగాడిగా ఉన్నానని, ఇకపై కూడా అన్నివిధాలా.. అంటే శారీరకంగా కూడా అదే విధంగా ఉండాలని అనుకుంటున్నాను అని స్పష్టంచేసింది. ఇదే విషయమై ఇండియా టుడే టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సుచేతన భట్టాచార్య.., " తన తల్లిదండ్రుల నుంచి లభించే గుర్తింపు కానీ లేదా కుటుంబం నుంచి లభించే గుర్తింపు కానీ పెద్ద విషయమే కాదన్న సుచేతన భట్టాచార్య.. తన ఎల్‌జిబిటిక్యూ ఉద్యమంలో భాగంగానే తాను ఇదంతా చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ట్రాన్స్‌మ్యాన్‌గా సమాజం నుంచి ప్రతీ రోజూ ఎదుర్కొంటున్న వేధింపులకు చెక్ పెట్టాలనుకుంటున్నాను" అని పేర్కొంది.
ఇది కూడా చదవండి : Couple Romancing On running Bike: కదిలే బైకుపై తిక్కవేషాలు.. తిక్క కుదిర్చిన పోలీసులు
" ఇప్పుడు నా వయసు 41 ఏళ్లు. నా జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని అయినా నేను తీసుకునే స్వేచ్ఛ నాకు ఉంది. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఈ వివాదంలోకి లాగొద్దు. మానసికంగా నన్ను నేను ఎప్పటి నుంచో మగవాడిగా భావిస్తున్నాను. ఇకపై శారీరకంగానూ ఉండాలని కోరుకుంటున్నాను " సుచేతన భట్టాచార్య చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు జరిగే పరిణామాలు ఏవైనా తానే పోరాడతాను అని.. తనకు ఆ ధైర్యం ఉంది అని చెప్పిన సుచేతన భట్టాచార్య.. ఎవరు ఏమన్నా పట్టించుకోనని సుచేతన తేల్చిచెప్పింది. " తన లింగ మార్పిడి గురించి మీడియా వాళ్లు వక్రీకరించవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను " అని సుచేతన భట్టాచార్య పేర్కొంది.
ఇది కూడా చదవండి : Most Wanted Monkey: జనాన్ని గడగడలాడించి చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ కోతి అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK