Whatsapp privacy feature: వాట్సప్ స్టేటస్ ఎందుకు పెట్టిందో తెలుసా..అసలు కారణాలివే...

Whatsapp privacy feature: వాట్సప్ ప్రైవసీ ఫీచర్లు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి. వాట్సప్ భవిష్యత్ ఆందోళనగా మారింది. మరమ్మత్తు చర్యలు చేపట్టింది. వార్తాపత్రికల్లో ప్రకటనలివ్వడమే కాకుండా..వాట్సప్ స్టేటస్‌లో పోస్ట్ చేసింది. అసలేంటి సమస్య...వాట్సప్ ప్రైవసీ ఫీచర్లేంటి..

Last Updated : Jan 17, 2021, 02:41 PM IST
Whatsapp privacy feature: వాట్సప్ స్టేటస్ ఎందుకు పెట్టిందో తెలుసా..అసలు కారణాలివే...

Whatsapp privacy feature: వాట్సప్ ప్రైవసీ ఫీచర్లు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి. వాట్సప్ భవిష్యత్ ఆందోళనగా మారింది. మరమ్మత్తు చర్యలు చేపట్టింది. వార్తాపత్రికల్లో ప్రకటనలివ్వడమే కాకుండా..వాట్సప్ స్టేటస్‌లో పోస్ట్ చేసింది. అసలేంటి సమస్య...వాట్సప్ ప్రైవసీ ఫీచర్లేంటి ( What are the whatsapp privacy features ).

వాట్సప్ నాలుగు పోస్ట్‌లను తన స్టేటస్‌ ( Whatsapp status ) లో పోస్ట్ చేసింది.  ఇందులో ప్రధానమైంది..Whatsapp does not read or listen to your personal conversations as they’re end-to-end encrypted.. అంటే వాట్సప్ మీ వ్యక్తిగత సంభాషణను చదవదని..వినదని..ఎందుకంటే అవి ఎండ్ టు ఎండ్ ట్రాన్స్‌క్రిప్టెడ్ అని అర్ధం. వాట్సప్ ఇలాంటి వివరణలో కూడిన స్టేటస్ పోస్ట్ ( Whatsapp status posts ) ‌లను ఇండియాలోనే కాకుండా ఇతర మార్కెట్‌లో కూడా పెడుతోంది. 

Also read; Army Day: జ‌వాన్ల‌తో వాలీబాల్ ఆడిన అక్ష‌య్ కుమార్

కొత్త ప్రైవసీ పాలసీ ( Whatsapp new privacy policy ) ను ప్రవేశపెట్టిన తరువాత వాట్సప్ పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. యూజర్లు కొత్త వాట్సప్ పాలసీను అంగీకరించేందుకు ఫిబ్రవరి 8 డెడ్‌లైన్ విధించింది. వాట్సప్ తీసుకున్న ఈ చర్య యూజర్లను పునరాలోచించేలా చేసింది. ఇప్పటికే చాలామంది వాట్సప్ యాప్‌ను డిలీట్ చేసుకుంటున్నారు. ఎలాన్ మాస్క్ వంటి దిగ్గజులు ఇప్పటికే ఫేస్‌బుక్ ( Facebook ) సంస్థకు చెందిన వాట్సప్‌ను వదిలేసి..సిగ్నల్ వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోమని పిలుపిచ్చిన పరిస్థితి. అప్పట్నించి ప్రైవసీ ప్రధానంగా ఉన్న టెలీగ్రామ్ ( Telegram ), సిగ్నల్ ( Signal ) వంటి యాప్‌ల డౌన్‌లోడింగ్ బాగా పెరిగింది.పరిస్థితిని అర్దం చేసుకున్న వాట్సప్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రైవసీ పాలసీ అమలును  వాయిదా వేసింది. మే వరకూ పొడిగించింది. యూజర్లు సమీక్షించుకుని..షరతుల్ని అంగీకరించేందుకు వీలుగా గడువు తేదీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 8 వరకూ ఎవరి ఎక్కౌంట్ సస్పెండ్ కావడం గానీ డిలీట్ కావడం గానీ జరగదని స్పష్టం చేసింది. వాట్సప్‌లో ప్రైవసీ ఎలా పనిచేస్తుంది..సెక్యూరిటీ ఎలా ఉంటుందనే విషయంలో నెలకొన్న భ్రమల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని వాట్పప్ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య ఎండ్ టు ఎండ్ ట్రాన్స్‌క్రిప్షన్ ( End to end transcription ) ఉండేలా వాట్సప్ దోహదం చేసిందని..సెక్యురిటీ టెక్నాలజీను ఇప్పుడు..భవిష్యత్‌లో కూడా కొనసాగించేందుకు కంకణం కట్టుకున్నామని వాట్సప్ తెలిపింది. వాట్సప్ ప్రైవసీ పాలసీపై నెలకొన్న భ్రమలు, పుకార్లను దూరం చేసేందుకు వీలుగా మాకు సహాయపడినవారందరీ కృతజ్ఞతలంటూ పోస్ట్ చేసింది. వ్యక్తిగతంగా కమ్యూనికేట్ చేసుకునేందుకు వాట్సప్‌ను బెస్ట్ యాప్‌గా మార్చే ప్రతి ప్రయత్నం చేస్తామని వాట్సప్ ( Whatsapp ) స్పష్టం చేసింది.

Also read: WhatsApp Delays New Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News